News August 20, 2024

HYD: లాయర్‌ సంతోష్‌పై చట్టప్రకారమే వ్యవహరించారు: సీపీ 

image

బోరబండలో న్యాయవాది సంతోష్‌ను పోలీసులు వేధింపులకు గురిచేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని సీపీ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 16న బోరబండలో న్యాయవాది నివాసం వద్ద, ఠాణాలో పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించారన్నారు. బోరబండ, మధురానగర్ ప్రాంతాల్లో రౌడీల చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించటానికి పోలీసులు చట్టప్రకారమే ప్రవర్తిస్తున్నారన్నారు.

Similar News

News November 6, 2025

బోరబండలో బండి సంజయ్ సభకు అనుమతి రద్దు!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బండి సంజయ్ సభకు అనుమతి రద్దయ్యింది. సా. బోరబండలో మీటింగ్ జరగాల్సి ఉంది. సభకు అనుమతి ఇచ్చి, ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అడ్డుకొన్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సభ జరిపి తీరుతామని చెబుతున్నారు. బీజేపీ శ్రేణులు బోరబండకు చేరుకోవాలని పిలుపునివ్వడం గమనార్హం. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని బీజేపీ లీడర్లు గుర్తుచేశారు.

News November 6, 2025

HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

image

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియా‌తో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్‌(35)‌ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News November 6, 2025

‘అప్పుడే సింగూరును ఖాళీ చేస్తాం’

image

నగరానికి తాగునీటిని అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనుల కోసం అందులోని నీటిని ఖాళీ చేయాలని నిపుణులు నిర్ణయించారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తరువాతే డ్యామ్‌లో నీటిని ఖాళీ చేస్తామని ఈఈ జైభీమ్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రాజెక్టు రిపేరుకు సంబధించి అధికారులు పలువురు ఎక్స్ పర్ట్స్ సలహాలు తీసుకోనున్నారు. ఐఐటీ హైదరాబాద్ ఇంజినీరింగ్ నిపుణులతో పరిశీలింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.