News July 21, 2024
HYD: లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ.. జాగ్రత్త..!

రైతు రుణమాఫీ పేరిట సైబర్ నేరస్థులు కొత్త పంథాలో బ్యాంకు ప్రొఫైల్ పేరిట వాట్సప్ ద్వారా మెసేజెస్, APK ఫైల్స్ పంపిస్తున్నారని HYD రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ కరుణాకర్ రావు తెలిపారు. APK ఫైల్ లింక్ క్లిక్ చేస్తే సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్తుందని, తద్వారా గూగుల్, ఫోన్‌పే లాంటివి ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తున్నారన్నారు. అలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News January 29, 2026
రంగారెడ్డి: ‘90001 13667కు సమాచారమివ్వండి’

అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉన్న పరిస్థితులుంటే వెంటనే హైడ్రా కంట్రోల్ రూం నంబరు 90001 13667కు ఫోను చేసి సమాచారమివ్వాలని హైడ్రా కమిషనర్ నగర ప్రజలను కోరారు. ఎక్కడ అగ్ని ప్రమాదానికి అవకాశం ఉన్నా లొకేషన్‌తో పాటు వీడియోలు, ఫొటోలు పంపించాలన్నారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. నగరంలోని అందరి లక్ష్యం అగ్ని ప్రమాదాలను తగ్గించడమే కావాలని కోరారు.
News January 26, 2026
రంగారెడ్డి: కలెక్టరేట్‌లో ఏర్పాట్లు అధ్వానం

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యారు. కానీ ఏర్పాట్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయని వచ్చిన వారు మండిపడుతన్నారు. కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో పసిపిల్లలను ఎత్తుకుని ఎండలో నిలబడ్డారు.
News January 25, 2026
HYD: సాగర తీర విగ్రహాల వెనుక దాగిన చరిత్ర

HYD- SECను కలిపే హుస్సేన్‌సాగర్‌కు వెళ్తే వరుసగా కొలువైన 34 మంది మహానీయుల విగ్రహాలపైకి చూపు మళ్లక మానదు. ముందు తరాల వారికి దీని గురించి తెలిసినా.. నేటి తరానికి అదొక ప్రశ్నే. ఈ విగ్రహాలతో వారి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరు ఎవరు? అనే సందేహం అందరి మదిలో మెదులుతోంది. ఈ మహనీయుల వీరగాథ, చరిత్ర చెప్పేందుకు Way2News రోజుక్కొక్కరి స్టోరిని సంక్షిప్తంగా అందిస్తుంది.


