News July 21, 2024
HYD: లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ.. జాగ్రత్త..!

రైతు రుణమాఫీ పేరిట సైబర్ నేరస్థులు కొత్త పంథాలో బ్యాంకు ప్రొఫైల్ పేరిట వాట్సప్ ద్వారా మెసేజెస్, APK ఫైల్స్ పంపిస్తున్నారని HYD రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ కరుణాకర్ రావు తెలిపారు. APK ఫైల్ లింక్ క్లిక్ చేస్తే సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్తుందని, తద్వారా గూగుల్, ఫోన్‌పే లాంటివి ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తున్నారన్నారు. అలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News September 13, 2025
HYD: మెట్రో నిర్వహణలో అసలేంటి L&Tకి సమస్య

L&T ఆధ్వర్యంలో సిటీలో 2017లో మెట్రో ప్రారంభమైంది. ఆ రోజుకు కంపెనీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తం రూ.3,756 కోట్లు. అయితే ఇంతవరకు ఆ మొత్తం సర్కారు చెల్లించలేదు. దీంతో ఆ మొత్తం వడ్డీతో కలిపి 2020 నాటికి రూ.5 వేల కోట్లకు పెరిగింది. ఈ మొత్తంతోపాటు ప్రభుత్వం ఇవ్వాల్సిన వయబిలిటీ ఫండ్ రూ.254 కోట్లూ ఇవ్వలేదు. దీంతోతాము ఇక నడపలేమని L&T చెబుతోంది.
News September 13, 2025
యాకుత్‌పురా ఘటనకు.. బాధ్యులపై హైడ్రా చర్యలు

యాకుత్‌పురా మౌలకా చిల్కాలోనీ మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనను హైడ్రా సీరియస్‌గా పరిగణించింది. దీనిపై హైడ్రా క్షుణ్నంగా విచారించింది. బుధవారం సిల్ట్‌ను తొలగించడానికి తెరచిన మ్యాన్ హోల్ మూయకపోవడంతో గురువారం పాఠశాలకు వెళ్తున్న చిన్నారి అందులో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డీఆర్ ఎఫ్ సూపర్వైజర్లు ఇద్దరికి డిమోషన్, ఇద్దరిని తొలగించాలని ఆదేశించింది.
News September 12, 2025
HYD: మిలాద్ ఉన్ నబి వేడుకల్లో డీజేలు నిషేధం

చార్మినార్ PS పరిధిలోని సనా గార్డెన్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీసీపీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో పోలీసులు, జీహెచ్ఎంసీ, విద్యుత్, ఆర్&బీ విభాగాల అధికారులు, సుమారు 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. డీజేలు, పటాకులు నిషేధం అని డీసీపీ స్పష్టం చేస్తూ, కార్యక్రమాలు ప్రశాంతంగా, సమయానికి ముగించాలని తెలిపారు.