News August 23, 2025
HYD: లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ హ్యాక్.. జర జాగ్రత్త..!: డైరెక్టర్

సైబర్ నేరగాళ్లు క్రెడిట్, డెబిట్ కార్డుల రివార్డు పాయింట్స్ పేరిట యాక్సిస్ బ్యాంక్, ఎస్పీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల పేర్లతో ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్‌సైట్ లింకులను పంపించి సైబర్ మోసాలకు పాల్పడి రూ.లక్షలు కొల్లగొట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయని HYD CSB డైరెక్టర్ IPS షికా గోయల్ తెలిపారు. లింక్‌లు క్లిక్ చేసిన తర్వాత అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారన్నారు. లింక్ మెసేజ్‌లతో జర జాగ్రత్త..!
Similar News
News August 23, 2025
HYD: ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డుల కోసం ప్రత్యేక శిబిరం

తెలంగాణలోని ట్రాన్స్‌జెండర్లకు ఐడీ కార్డులు, ఆధార్ కార్డుల సవరణలకు ఒక ప్రత్యేక శిబిరం ఆగస్టు 26న హైదరాబాద్‌లోని దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ శిబిరం ఉదయం 10:30 నుంచి సా.5:30 గంటల వరకు ఉంటుందని ఆ శాఖ డైరెక్టర్ బి.శైలజ ఈరోజు తెలిపారు. ఈ అవకాశాన్ని ట్రాన్స్‌జెండర్లు వినియోగించుకోవాలని కోరారు.
News August 23, 2025
HYD: పీఏసీ సమావేశాలు ప్రారంభం.. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వంపై హర్షం

HYD గాంధీభవన్‌లో పీఏసీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఓటు చోరీపై ప్రత్యేక ప్రచార లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు.
News August 23, 2025
HYD: యూరియా సరఫరాపై మంత్రుల సమీక్ష

రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, BRS దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురికావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం, వ్యవసాయ, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులతో శనివారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సీజన్‌లో 145 రోజుల్లో 40 రోజులు మాత్రమే ప్లాంట్ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.