News October 11, 2025
HYD: లిక్కర్ పంపిణీ కట్టడికి చర్యలు తీసుకోవాలి: కర్ణన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లిక్కర్ పంపిణీ కట్టడికి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రలోభాల కట్టడికి కలిసికట్టుగా పనిచేయాలని, అన్ని శాఖల పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Similar News
News October 11, 2025
BREAKING: HYD: మొయినాబాద్‌లో దారుణం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సురంగల్ గ్రామానికి చెందిన రామగళ్ల ప్రసాద్ అనే వ్యక్తి 250 గజాల ప్లాట్ విషయంలో తన బాబాయి అయిన రామగళ్ల శ్యామ్(45)పై కత్తితో దారుణంగా దాడి చేశాడు. చేతులు, మెడపై నరికాడు. గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 11, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నిరుద్యోగుల సంచలన ప్రకటన

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నిరుద్యోగులు సంచలన ప్రకటన చేశారు. బైపోల్‌లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసిందని పేర్కొన్నారు. ఈక్రమంలో జీపీఓ, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, డీఎస్సీ, గ్రూప్ 1,2,3,4 నోటిఫికేషన్ల కోసం పోరాడుతున్న దాదాపు 30 మంది నిరుద్యోగులు ఎన్నికల బరిలో ఉంటారన్నారు.
News October 11, 2025
HYDలో వేసవి విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా చర్యలు

HYDలో ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా చర్యలకు ఉపక్రమించినట్లుగా TGSPDCL ఎండీ ముషారఫ్ అలీ తెలిపారు. ఈ మేరకు రెండు రోజులు వర్చువల్, ఆన్ ఆఫీస్ పద్ధతిలో సర్కిల్ స్థాయిలోని అధికారులకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దిశనిర్దేశం చేశారు. ఇప్పటి నుంచి ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. ఈసారి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.