News June 14, 2024
HYD: లెటర్స్ ఇచ్చిన సీఎం.. పోస్టింగ్ ఇవ్వలేదు: అభ్యర్థులు

HYD ప్రజాభవన్ ఇన్‌ఛార్జ్ సంగీతతో పాటు చిన్నారెడ్డికి ఈరోజు గురుకుల అపాయింట్‌మెంట్ లెటర్స్ పొందిన అభ్యర్థులు వినతి పత్రాన్ని అందించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తాము అపాయింట్‌మెంట్ లెటర్స్ తీసుకున్నామని, ఇప్పటివరకు తమకు పోస్టింగ్ ఇవ్వలేదని వాపోయారు.అనంతరం నాంపల్లిలోని ట్రెబ్ ఛైర్మన్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. న్యాయం చేయాలని కోరారు.
Similar News
News February 21, 2026
HYD: 5 ఓట్లు ఉంటే రూ.లక్ష..!

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఓట్ల కోసం సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బరిలో నిలిచిన వారు ఒకరిని మించి ఒకరు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం. కొన్నిచోట్ల ఐదు ఓట్లు ఉన్న ఇంటికి లక్షల్లో డబ్బులు అందినట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులు ఉన్న వార్డుల్లో రూ.10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు చర్చ నడుస్తోంది.
News February 20, 2026
రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్ చేపట్టి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పాత నేరస్థుడు ఖాజా వహాబుద్దీన్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 43 కేసుల్లో నిందితుడైన ఇతడు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత 20 రోజుల్లోనే ఈగిల్ ఫోర్స్ టీమ్ 225 మందిని అరెస్ట్ చేసింది.
News February 20, 2026
HYD: లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన విద్యాశాఖ అధికారులు!

స్కూల్ CBSE NOC ఫైల్‌ను క్లియర్ చేసేందుకు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు విద్యాశాఖ అధికారులను ACB రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సూపరింటెండెంట్ సంగీత ఫణిరాజ్, రంగారెడ్డి డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను నాంపల్లి ACB కోర్టులో హాజరుపరిచారు.


