News November 22, 2025
HYD: లేడి కానిస్టేబుల్ అంటూ మోసం.. అరెస్ట్

జీడిమెట్లలో లేడి కానిస్టేబుల్ అంటూ పలువురిని మోసం చేస్తున్న మహిళను బాలానగర్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమా భారతిని రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. నిందితురాలు ప్రజలను నమ్మించి మోసపూరిత కార్యకలాపాలు చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 23, 2025
GDK: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని గోదావరిఖని అదనపు జిల్లా జడ్జి డాక్టర్ టీ.శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా అదనపు న్యాయ స్థానంలో లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పలు కేసుల్లో నిందితులు రాజీ కుదుర్చుకునేందుకు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జడ్జిలు, పోలీసు శాఖ అధికారులున్నారు.

స్వచ్ఛ ఏలూరు లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా అని స్వచ్ఛ ఏలూరు జిల్లాగా రూపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ, తదితర అంశాలపై జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఎక్కడ బహిరంగ మలవిసర్జన జరగకుండా చూడాలని, ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.