News March 22, 2026
HYD: ‘లే అమ్మా..’ రాత్రంతా తల్లి శవం వద్ద కూతురు

నగర శివారు షాద్‌నగర్‌లోని రంగారెడ్డిగూడకి చెందిన శోభ దారుణ హత్యకు గురైన విషయం <<19447260>>తెలిసిందే<<>>. ఉదయం పొలాల్లో పసిపాప ఏడుపు వినిపించడంతో గమనించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి నుంచి కూతురు తల్లి మృతదేహం వద్దనే ‘లే.. అమ్మా’ అంటూ రోదిస్తున్న దృశ్యం అందరిని కలిచివేసింది.
Similar News
News March 29, 2026
కావలిలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ దుర్మరణం

కావలి రూరల్ వెంకయ్యగారిపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ కోరికల అంకయ్య (53) దుర్మరణం చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అంకయ్య కునుకు తీయడంతో లారీ కల్వర్టులో పడిపోయింది. రూరల్ ఎస్సై తిరుమల్ రెడ్డి కేసు నమోదు చేశారు.
News March 29, 2026
జోనితా గాంధీ ఎవరంటే?

‘చిచ్చుబుడ్డి’ <<19508487>>పాటలో<<>> స్టెప్పులతో అదరగొట్టిన జోనితా గాంధీ గాయని. తెలుగు, హిందీ తదితర భాషల్లో సాంగ్స్ పాడారు. మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో తొలుత SPBతో పాట పాడే అవకాశం ఆమెకు వచ్చింది. ‘కిక్-2’లోని ‘నువ్వేనువ్వే’ పాటతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. OK బంగారం, 24 తదితర సినిమాల్లో పాటలు పాడారు. ఢిల్లీలో పుట్టిన ఆమె టొరంటోలో చదువుకొని సంగీతంపై ఇష్టంతో ఇండియాకు తిరిగొచ్చారు.
News March 29, 2026
గ్యాస్ సమస్యల పై కమాండ్ కంట్రోల్ ఏర్పాటు: జేసీ

నంద్యాల జిల్లాలో గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ ఏజెన్సీ వారు వంట గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టరు కె. కార్తీక్ హెచ్చరించారు. జిల్లాలో గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదన్నారు. ఇండెంట్ ప్రకారం ఆయిల్ కంపెనీలు గ్యాస్ సరఫరా చేస్తున్నాయని అన్నారు. గ్యాస్ సమస్యల పై కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నంబర్ 08514-293903 కు ఫిర్యాదు చేయాలన్నారు.


