News July 7, 2025

HYD: ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్.. హైడ్రా కీలక సూచన

image

భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక సూచన చేశారు. NRI వ్యక్తులు, పెట్టుబడిదారులు భూ కొనుగోలుకు ముందు HMDA వెబ్‌సైట్ ద్వారా FTL, బఫర్‌జోన్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. హైడ్రా కూడా చెరువుల FTL నోటిఫికేషన్ కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో కలిసి పనిచేస్తోంది. శాటిలైట్ డేటా, 2006 మ్యాప్స్ ఆధారంగా త్వరలో 15 సెం.మీ. రిజల్యూషన్‌తో 3Dమోడల్స్ రూపొందిస్తున్నారన్నారు.

Similar News

News July 7, 2025

NRPT: ఫిజియోథెరపీ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి

image

నారాయణపేట పట్టణంలోని భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన నిర్వహించే ఫిజియోథెరపీ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో బాలాజీ అన్నారు. సోమవారం భవిత కేంద్రంలో నిర్వహించిన క్యాంపును పరిశీలించారు. డాక్టర్ ప్రీతి గౌడ్ పిల్లలకు చేస్తున్న ఫిజియోథెరపీని పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఫిజియోథెరపీ చేయించుకోవాలని చెప్పారు. ప్రతి సోమవారం, బుధవారం క్యాంపు ఉంటుందన్నారు.

News July 7, 2025

వరంగల్ బల్దియా బడ్జెట్ రూ.120 కోట్లు

image

వరంగల్ బల్దియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.120 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మేయర్ సుధారాణి తెలిపారు. కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ఎలాంటి తారతమ్యాలు లేకుండా సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్న సీఎం రేవంత్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News July 7, 2025

అన్నా క్యాంటీన్‌లో ఆహారం నాణ్యంగా ఉండాలి: కలెక్టర్

image

రామచంద్రపురంలోని అన్నా క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆహార పదార్థాలు నాణ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.