News March 19, 2024

HYD వచ్చిన యువతి.. వ్యభిచారం చేయాలని దాడి..!

image

ఉపాధి కోసం HYDకు వచ్చిన యువతితో వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గద్వాల జిల్లాకు చెందిన యువతి టెలీకాలర్ జాబ్ కోసం ఈనెల 10న నగరంలోని MGBS బస్టాండ్‌కు వచ్చింది. ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి IBPకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వంగపహాడ్‌(WGL)కు తరలించి వ్యభిచారం చేయాలని దాడి చేశారు. ఈ విషయమై బాధితురాలు హసన్‌పర్తి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Similar News

News July 3, 2024

గోల్కొండ దేవాలయ ఛైర్మన్‌గా అరవింద్ మహేశ్ కుమార్

image

చారిత్రాత్మక గోల్కొండ కోట శ్రీజగదాంబిక మహంకాళి దేవాలయ ఛైర్మన్‌గా అరవింద్ మహేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ 14 మంది సభ్యులతో కూడిన బోనాల ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసి ఉత్తర్వులను జారీ చేశారు. సభ్యులందరూ అరవింద్ మహేశ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోనాల ఉత్సవాల కమిటీ సభ్యులుగా పలువురు నియమితులయ్యారు.

News July 3, 2024

HYD: 7 నుంచి అంధ అభ్యర్థులకు నిర్ధారణ పరీక్షలు

image

గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా అంధ అభ్యర్థులు వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కావాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఈ.నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంధ అభ్యర్థులు ఈనెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఎదుట ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

News July 3, 2024

HYD: నీట్ పరీక్షను భేషరతుగా రద్దు చేయాలి: జాజుల

image

దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షను భేషరతుగా రద్దు చేయాలని, నీట్ పరీక్ష పత్రం లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.