News June 17, 2024

HYD: వరదలపై 158 ఫిర్యాదులు

image

గ్రేటర్‌లో 9,103 కిలోమీటర్ల మేర రహదారులున్నాయి. 1,302 కిలోమీటర్ల మేర వరద ప్రవాహ వ్యవస్థ ఉంది. అభివృద్ధి చెందిన నగరాల్లో రహదారులకు ఇరువైపులా వరద నీటి ప్రవాహ వ్యవస్థ ఉంటుంది. కానీ, HYD నగరంలో ఆ పరిస్థితి లేదు. ఇటీవలే గంటసేపు కురిసిన వానకు వర్షపు నీరు రోడ్ల పై నిలిచింది. వరద ఏరులై పారుతోందని, ఇబ్బందులు తప్పడం లేదన్న వివిధ కారణాలతో దాదాపుగా 158 ఫిర్యాదులు అందాయి.

Similar News

News October 4, 2024

BREAKING: HYD: విషాదం.. ముగ్గురు చిన్నారులు మృతి

image

మేడ్చల్ జిల్లాలో కాసేపటి క్రితం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. శామీర్‌పేట్ పరిధి మూడుచింతలపల్లి మండలం కొల్తూరు చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. దసరా సెలవుల నేపథ్యంలో హర్ష, మణికంఠ, మనోజ్ ఇంటి దగ్గర నుంచి ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఈత కొడదామని దిగి ఊపిరాడక చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. > సెలవు రోజుల్లో పిల్లలు జర జాగ్రత్త..!

News October 4, 2024

HYD: మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో అడ్మిషన్స్

image

మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. MA-Urdu,MA -Hindi,MA-English, BA,B com, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నా యని చెప్పారు. వెబ్‌సైట్ http//manuadmission mion.samarth.edu.in దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10 నవంబర్ 2024 వరకు అవకాశం ఉందని చెప్పారు.

News October 4, 2024

HYD: నేటి నుంచి పీసీసీ చీఫ్ జిల్లా పర్యటన

image

PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం నుంచి జిల్లా పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. ఆయన సొంత జిల్లా నిజామాబాద్ నుంచే పర్యటన ప్రారంభించనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటి నుంచి నిజామాబాద్ బయలుదేరుతారు. ఆయన వెంట ఎనిమిది మంది మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ సీనియర్ నేతలు ఉంటారని తెలిపారు.