News February 5, 2026

HYD: వర్క్ STRESSతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ SUICIDE

image

మియాపూర్‌లోని BKఎన్‌క్లేవ్‌లో ఓ యువకుడు గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. AP అమలాపురానికి చెందిన సతీశ్(31) గచ్చిబౌలిలోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. పనిఒత్తిడి తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సతీశ్‌కు ఏడాది క్రితం వివాహం కాగా భార్య సొంతూరుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 7, 2026

NTRను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: సీపీ

image

NTR జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు అనుమానం ఉంటే తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ముందస్తు సమాచారం ఇస్తే శిక్షించడం కంటే, వారిని మార్చేందుకు అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తామని హామీ ఇచ్చారు. యువత భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు.

News February 7, 2026

ASF: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు

image

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆన్‌లైన్ నమోదు గడువును పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నదీమ్ శనివారం తెలిపారు. ప్రభుత్వ మైనారిటీల సంక్షేమ శాఖ కమిషనర్ సూచనలతో ప్రభుత్వ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించామన్నారు.

News February 7, 2026

గద్వాల కోటలో ఎవరి జెండా..?

image

మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల రాజకీయం రసవత్తరంగా మారింది. 37వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపిక గుదిబండగా మారింది. అసంతృప్త జ్వాలలు, స్వతంత్రుల పోరుతో హస్తం పార్టీ నేతలు సతమతమవుతున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకుంటూ ఫలితాలను తలకిందులు చేసే శక్తిగా అవతరించేలా ఉంది. స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం కూడా ఇక్కడ కీలకంగా మారనుంది.