News October 25, 2025
HYD: వస్త్రాల వ్యర్థాల రీసైక్లింగ్ అంతంతే..!

గ్రేటర్ HYDలో ఏటా సుమారుగా 15 టన్నులకు పైగా వస్త్రాలకు సంబంధించిన వ్యర్థాలు విడుదలవుతున్నాయి. కానీ.. వీటిని రీసైక్లింగ్, పునర్వినియోగం చేయడంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. కేవలం 14 శాతం మాత్రమే రీసైక్లింగ్ జరుగుతున్నట్లుగా TGTRS తెలియజేసింది. రాబోయే రోజుల్లో ఈ శాతాన్ని మరింత పెంచడం కోసం కృషి చేస్తామని పేర్కొంది.
Similar News
News October 25, 2025
HYD: ఒక్క రోజులో 8 కేసులు.. రూ.2.55 కోట్లు కొట్టేశాడు..!

పెట్టిన పెట్టుబడికి ఏడాదిలో 500 శాతం లాభం ఇస్తానని ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా 58 ఏళ్ల వ్యక్తిని సైబర్ నేరగాడు నమ్మించాడు. అనంతరం తన డిజిటల్ ఖాతాలో రూ.1.92 కోట్లు కనిపించడంతో సంతోషించిన బాధితుడు.. అతడు చెప్పినట్లు రూ.75 లక్షలను పెట్టాడు. ఎంతకీ విత్‌డ్రా కాకపోవడంతో మోసపోయానని బాధితుడు సైబర్ క్రైమ్ PSలో ఫిర్యాదు చేశాడు. కాగా సదరు సైబర్ నేరగాడు ఇలా ఒక్క రోజులోనే 8కేసుల్లో రూ.2.55కోట్లు కొట్టేశాడు.
News October 25, 2025
HYD: డీఐ ఛేజింగ్.. ఎట్టకేలకు అతడు చిక్కాడు..!

HYD దుండిగల్ PS పరిధిలో ఖయ్యూం అనే వ్యక్తి ఒకరిని మోసం చేసి రూ.25 లక్షలను కాజేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం రాత్రి మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో ఖయ్యూం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో డీఐ కిరణ్ సిబ్బందితో కలిసి వెళ్లాడు. పోలీసులను చూడగానే ఖయ్యూం రైలు పట్టాల మీదుగా పరిగెత్త సాగాడు. డీఐ కిరణ్, సిబ్బంది కలిసి అతడి వెంట పరిగెత్తి సినిమా స్టైల్‌లో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.
News October 25, 2025
ఓయూ: ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలు ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను నవంబర్ 6 నుంచి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని ఆయన కోరారు.


