News October 8, 2025

HYD: వాటర్ ట్యాంకర్లు ‘మాయం’.. చేయలేరిక

image

నీటి ట్యాంకర్ల దారి మళ్లింపులు, అక్రమ బిల్లింగ్‌లపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు HMWSSB ఆటోమేటిక్ వెహికల్ ట్రాకింగ్ సిస్టం (AVTS) తీసుకొచ్చింది. యాప్‌లో లైవ్ ట్రాకింగ్‌తో ట్యాంకర్లు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ట్రిప్, బిల్లు డిజిటల్‌గా రికార్డ్ అవ్వడంతో అక్రమాలకు తావుండదు. వాహనం ఆలస్యమైనా అధికారులకు అలర్ట్‌లు వెళ్తాయి. ఈ అప్‌గ్రేడ్‌తో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకమైన సేవలు అందుతాయి.

Similar News

News October 8, 2025

జూబ్లీ ఉపఎన్నిక కట్టుదిట్టం.. నియమావళి అమలు

image

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో MCCను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 1,620 రాజకీయ పోస్టర్లు, వాల్ రైటింగ్స్, బ్యానర్లు తొలగించారు. వీటిలో 1,097 ప్రభుత్వ ఆస్తులపై, 523 వ్యక్తిగత ఆస్తులపై ఉన్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ కర్ణన్ అన్ని ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, సర్వైలెన్స్ టీములు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

News October 8, 2025

వైరల్ ఫీవర్‌తో నిమ్స్‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి

image

వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకి వైరల్ ఫీవర్ వచ్చింది. దీంతో నిమ్స్ ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. ఒక మంత్రిగా నిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అవ్వటాన్ని చాలా మంది అభినందిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 8, 2025

రాజేంద్రనగర్‌‌లో యువకుడి దారుణ హత్య

image

రాజేంద్రనగర్‌‌లోని ఫొటో వ్యూ కాలనీలో యాసీన్ అనే యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు నివసిస్తున్న ఏరియాలో మహిళతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.