News February 11, 2026

HYD: వాటర్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వీరే!

image

నగరంలో నాన్ క్యాడర్ అధికారుల బదిలీలు జరిగాయి. మల్కాజిగిరి HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్.పంకజ బదిలీ అయ్యారు. హైదరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సామ్రాట్ అశోక్ నామ బదిలీ కాగా, సైబరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎం.సంతోష్ బదిలీ అయ్యారు. లోక్ భవన్ జాయింట్ సెక్రటరీగా కె.శశికిరణచారి బదిలీ అయ్యారు. సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News February 11, 2026

CYB మున్సిపల్ కార్పొరేషన్ MAP!

image

CYB మున్సిపల్ కార్పొరేషన్ (CMC) మ్యాప్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ కార్పొరేషన్‌లో 3 జోన్లు ఉన్నాయి.
శేరిలింగంపల్లి ZONE: నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు ఉన్నాయి.
కూకట్‌పల్లి ZONE: మాదాపూర్, అల్వీన్‌కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్లు ఉన్నాయి.
కుత్బుల్లాపూర్ ZONE: చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట, దుండిగల్, మేడ్చల్ సర్కిళ్లు ఉన్నాయి.

News February 11, 2026

HYD: ఏ జోన్‌లో ఎంతమంది కార్పొరేటర్లు అంటే?

image

GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించారు. మల్కాజిగిరిలో 3 జోన్లు(మల్కాజిగిరి, Uppal, LBనగర్), 14 సర్కిళ్లు, 74 వార్డులున్నాయి (కార్పొరేటర్). HYDలో 6 జోన్లు(శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, SEC BAD), 30 సర్కిళ్లు, 150 వార్డులున్నాయి.సైబరాబాద్‌లో 3 జోన్లు(శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్), 16 సర్కిళ్లు, 76 వార్డులున్నాయి. మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులు.

News February 11, 2026

జలమండలిలో ఇద్దరు ‘డైరెక్టర్లు’!

image

సిటీ పరిధి పెరిగింది.. నీళ్ల కనెక్షన్లు పెరిగాయి. అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసేందుకు సర్కారు ఇద్దరు కొత్త బాసులను దింపుతోంది. HMWS&SB సేవలు ORR దాకా విస్తరించడంతో పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం 2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులను మంజూరు చేసింది. జాయింట్/అదనపు సెక్రటరీ క్యాడర్ అధికారులను డెప్యుటేషన్‌పై నియమించనున్నారు. కనెక్షన్లు 14.50 లక్షలకు చేరడంతో 3 స్వతంత్ర విభాగాల ద్వారా మెరుగైన సేవలు అందిస్తారు.