News February 14, 2025

HYD: వాటిని గుర్తిస్తే ఫిర్యాదు చేయండి: డీజీ

image

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్రమంగా మెడిసిన్ నిల్వలు, తయారీ, విక్రయాలు జరిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని డీజీ డీకే కమలాసన్ రెడ్డి సూచించారు. 18005996969కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం అందినా తమకు తెలియజేయాలని సూచించారు.

Similar News

News September 12, 2025

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వాణి

image

గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా అడిషనల్ డీఎంఈ డాక్టర్ వాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ రాజకుమారిని ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా బదిలీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

News September 9, 2025

ఉమ్మడి RR ఏఎంసీ ఛైర్మన్‌ల గౌరవ అధ్యక్షుడిగా పెంటయ్య

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏఎంసీ ఛైర్మన్ల గౌరవ అధ్యక్షుడిగా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెంటయ్య గౌడ్ ఎన్నికయ్యారు. పలు మండలాల ఏఎంసీ ఛైర్మన్లు ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏఎంసీ ఛైర్మన్‌ల గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వారందికీ ధన్యవాదాలు తెలిపారు.

News September 9, 2025

మాజీ సీఎం కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలి: రాజాసింగ్

image

హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హుస్సేన్‌సాగర్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్న కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను వేరే చోటికి తరలిస్తే సాగర్‌ను మంచినీటితో నింపవచ్చని సూచించారు.