News September 12, 2025
HYD: వాట్సాప్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదుదారులకు ఎఫ్‌ఐఆర్‌ను వాట్సాప్‌లో పంపించే సరికొత్త విధానానికి సీపీ అవినాష్ మహంతి శ్రీకారం చుట్టారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి బాధితుడికి వాట్సాప్‌లో పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో పోలీసు సేవలు పారదర్శకంగా ఉండటంతో పాటు, ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.
Similar News
News March 29, 2026
కరీంనగర్‌లో ‘పింక్’ సిటీ సోయగం!

కరీంనగర్ నగరంలోని శాతవాహన రోడ్డు ప్రస్తుతం ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తోంది. రహదారికి ఇరువైపులా ఉన్న ‘టబుబియా రోసియా’ చెట్లు లేత గులాబీ రంగు పూలతో నిండిపోయి, చూసేవారికి కనువిందు చేస్తున్నాయి. ఎటు చూసినా వికసించిన పూల సోయగాలతో ఈ ప్రాంతం ఒక విదేశీ లోకాన్ని తలపిస్తోంది. వేసవి ఎండల్లోనూ ఈ పూల అందాలు నగరవాసులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
News March 29, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 29, 2026
నిజామాబాద్: కళ్లాల్లో ధాన్యం.. ఎదురుచూపుల్లో అన్నదాత

నిజామాబాద్ జిల్లాలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి పంట చేతికొచ్చినా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం రైతులను కలవరపెడుతోంది. ఆరబోసిన ధాన్యం కుప్పల వద్దే రైతులు పడిగాపులు. అకాల వర్షాలు కురిస్తే రూపాయల పంట తడిసి ముద్దవుతుందని ఆందోళన చెందుతున్నారు. వెంటనే కేంద్రాలను ప్రారంభించి, మద్దతు ధరతో ధాన్యం సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.


