News September 24, 2025
HYD: వాడిన నూనెనే..మళ్లీ మళ్లీ.!

HYD పిజ్జా, డొమినోస్, మాస్టర్ బేకరీలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మంగళవారం ఆకస్మిక తనిఖీలతో అనేక లోపాలు బట్టబయలయ్యాయి. వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడుతున్నట్లు గుర్తించారు. పన్నీర్‌కు లేబులింగ్ లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. ఓవర్ యూజ్ ఆయిల్ ఆరోగ్యానికి హానికరమని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి లోపాలు ఇతర రెస్టారెంట్లలోనూ కనిపిస్తున్నాయి.
Similar News
News September 24, 2025
SKLM: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

వాయుగుండం ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండటంతో రానున్న 4 రోజులు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి 40 నుంచి 50కి.మీ వేగంతో గాలులు విస్తాయన్నారు. 08942-240557ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
News September 24, 2025
దేశంలోనే తొలిసారి TTDలో అమలు

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-లోని 25వ కంపార్ట్మెంట్ వద్ద ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటైంది. దేశంలోనే తొలిసారి TTD ఆందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా అలిపిరి నుంచే భక్తుల రద్దీని అంచనా వేస్తారు. క్యూ లైన్‌లో ఎంత మంది భక్తులు ఉన్నారు? దర్శనానికి ఎంత సమయం పడుతుంది? తదితర అంశాలను ఏఐ గుర్తించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిస్టంకు సమాచారం, 3డీ మ్యాప్, ఫొటోలు అందజేస్తుంది.
News September 24, 2025
ఆసియా కప్: శ్రీలంక ఇంటికే..!

ఆసియా కప్ సూపర్-4లో రెండు మ్యాచుల్లో ఓటమితో శ్రీలంక ఫైనల్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఆ జట్టు ఫైనల్ చేరాలంటే భారత్ తర్వాతి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో ఓడాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూర్య సేన ఫామ్‌ను చూస్తే అది అసాధ్యమే అని చెప్పొచ్చు. అటు రేపటి మ్యాచులో బంగ్లాదేశ్ పాక్‌ను ఓడించడంతో పాటు ఈ నెల 26న టీమ్ ఇండియాపై శ్రీలంక తప్పనిసరిగా గెలవాలి. ఇదంతా జరిగినా NRR ఆధారంగానే ఫైనలిస్టులు ఖరారు అవుతాయి.