News October 26, 2025
HYD: వారి నెత్తుటితో తడిచిన నేల స్మరిస్తోంది

పాషా నరహరి అంటే ఇద్దరు కాదు.. ఒక్కరిగా ప్రజలకు గుర్తు. పేదల పక్షాన పోరాడిన ఈ మహణీయులు మంచాలలోని జాపాలలో జన్మించారు. వీరు పుట్టిన ఊరు చరిత్రలో నిలిచిలా భూస్వాములతో పోరాడారు. 1989లో ఇదే రోజున ఆ వీరులను గూండాలు కాపుగాసి లింగంపల్లి గేటు వద్ద కత్తులు, గొడ్డళ్లతో కిరాతకంగా నరికి చంపారు. వారి నెత్తుటితో తడిచిన నేల ఇప్పటికీ వారిని స్మరించుకుంటోంది. నేడు వారి వర్ధంతికి ప్రజలు వారిని గుర్తుచేసుకుంటున్నారు.
Similar News
News October 26, 2025
31న మెదక్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్: DSP

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 31న మెదక్ పట్టణంలోని పీఎన్‌ఆర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇది ‘ఓపెన్ టు ఆల్’ టోర్నమెంట్ అని, 30న సాయంత్రం 5 గంటలలోగా ఆర్‌ఎస్‌ఐ నరేష్(87126 57954) వద్ద పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.
News October 26, 2025
జూబ్లీహిల్స్‌లో సీఎం ప్రచార షెడ్యూల్ ఖరారు

TG: సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార షెడ్యూల్ ఖరారైంది. డివిజన్ల వారీగా ఈనెల 30, 31 తేదీల్లో తొలి విడత, NOV 4, 5 తేదీల్లో రెండో విడత ప్రచారం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడి నివాసానికి వెళ్లారు. రామ్మోహన్ కుమారుడి బారసాల ఉత్సవంలో పాల్గొని ఆశీర్వదించారు. ఇవాళ రాత్రికి రేవంత్ HYD చేరుకోనున్నారు.
News October 26, 2025
కాంగ్రెస్ మునిగిపోయే నావ: కవిత

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, వారితో తనకు పని లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారాన్ని కాపాడుకోలేకపోతోందని విమర్శించారు. ఆ పార్టీకి ప్రజల నుంచే దిక్కు లేదని, తనకు మద్దతు తెలుపుతున్నారన్న దాంట్లో వాస్తవం లేదని ఆమె ఎద్దేవా చేశారు.


