News September 6, 2025
HYD: వారేవా! బుడ్డోడు భక్తితో గణపయ్యను కట్టేశాడు

HYDలో గణేశ్ నిమజ్జనంలో 5 ఏళ్ల బాలుడు సందడి చేశాడు. చిన్న గణపయ్యను తాను ఆడుకునే బైక్‌పైనే ట్యాంక్ బండ్‌పైకి తీసుకురావడం అందరినీ ఆకట్టుకుంది. అ బాలుడి భక్తికి అక్కడికి వచ్చిన పర్యాటకులందరూ తన్మయత్వంలో మునిగారు. ‘గణపయ్యను తాళ్లతోనే కాకుండా నీ భక్తితో కట్టేశావ్.. నీకు సకల శుభాలు కలుగుగాక’ అంటూ దీవిస్తున్నారు. అతడితో ఫొటోలు దిగారు. ఈ అబ్బాయి వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
Similar News
News September 6, 2025
SPMVV: పీజీ ఫలితాలు విడుదల

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జులైలో ఎమ్మెస్సీ (M.Sc) స్టాటస్టిక్స్, ఎమ్మెస్సీ (M.Sc) సెరికల్చర్ రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
News September 6, 2025
స్పాన్సర్ లేకుండానే భారత జెర్సీలు.. పిక్స్ వైరల్

ఆసియా కప్ కోసం టీమ్ ఇండియా కసరత్తులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో స్పాన్సర్ లోగో లేని జెర్సీలు ధరించి టీమ్ ఇండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, గిల్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య తదితరులు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చారు. కాగా టీమ్ ఇండియా స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11ను బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే. ఈ నెల 9 నుంచి దుబాయ్‌లో ఆసియా కప్ ప్రారంభం కానుంది.
News September 6, 2025
స్వచ్ఛ సర్వేక్షణలో పారదర్శకంగా ఎంపికలు: కలెక్టర్

పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల కోసం ఎంపికలను పారదర్శకంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, బస్టాండ్లు, పాఠశాలలు, రైతు బజార్లను ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేయాలని సూచించారు.