News August 13, 2024

HYD: ‘వాహనం ఎంతకు కొన్నా పూర్తి ట్యాక్స్ కట్టాలి’

image

వాహన కొనుగోలులో షోరూమ్‌లు ఇచ్చిన డిస్కౌంట్‌కు కూడా పన్ను చెల్లించాల్సిందేనని, పూర్తి ట్యాక్స్‌ కడితేనే ఆ వాహనం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని ఆర్టీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాహన ధర ఆర్టీఏ డేటాబేస్‌లో ఉంటుందని, డిస్కౌంట్‌ అనేది పన్ను మినహాయింపునకు కాదని కస్టమర్లు గుర్తించాలని సూచించారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనం ఏ ధరకు కొనుగోలు చేసినా పూర్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Similar News

News November 8, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓట్లేయడానికి వస్తారా?

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4.01 లక్షల మంది ఓటర్లున్నారు. ఇంతవరకు జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 2009లో 52% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో (2023)లో అయితే కేవలం 47.49%. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. పోల్ పర్సెంటేజీ పెరిగితే ఆ ఓటింగ్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది 14నే తెలుస్తుంది. అంతా పర్సెంటేజీపైనే ఆధారపడి ఉంటుంది.

News November 8, 2025

జూబ్లీ బై పోల్: ఏజెంట్లకు గమనిక.. రేపు సాయంత్రం వరకే పాసులు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏజెంట్లుగా కూర్చునే వారికి ఎన్నికల అధికారులు కీలక సూచనలు చేశారు. 11న ఎన్నికలు జరుగుతుండటంతో వివిధ రాజకీయ పార్టీల తరఫున ఎంపికైన ఏజెంట్లు పాసులు 10వ తేదీ సాయంత్రం లోపు తీసుకోవాల్సి ఉంటుంది. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు స్థానిక బూత్‌తో అధికారులను కలిసి పాసులు పొందాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు. వీరంతా 11న ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాలకు రావాలన్నారు.

News November 8, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: టార్గెట్ లక్ష ఓట్లు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నాయకులు ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు. ఎన్ని ఓట్లు వస్తే గెలిచే అవకాశముంటుంది.. ఎంత పోలింగ్ శాతం నమోదైతే తమ విజయావకాశాలుంటాయని మ్యాథమ్యాటిక్స్ నిపుణలయిపోతున్నారు. మొత్తం 4,01,365 ఓట్లలో 50% పోల్ అయితే (అంటే 2 లక్షలు) గెలిచేందుకు లక్ష ఓట్లు వస్తే చాలన్నమాట.. అందుకే టార్గెట్ లక్ష అంటూ నాయకులు ఎవరికి వారు ఊహాలోకాల్లో మునిగిపోతున్నారు.