News March 2, 2025

HYD: వాహనం నంబరు కనిపించకుంటే ఇక అంతే..!

image

ట్రాఫిక్ ఉల్లంఘనలపై HYD పోలీసులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 2నెలల్లో ఇప్పటివరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్‌తో ఒకరు మృతి చెందగా.. 21 మందికి గాయాలైనట్లు తెలిపారు. అస్పష్ట నంబరు ప్లేట్, వాహనదారులకు రూ.200 జరిమానాతో పాటు ఛార్జీషీటు దాఖలు చేస్తామన్నారు.

Similar News

News April 23, 2025

HYD: నెహ్రూ జూలాజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్

image

నెహ్రూ జూలాజికల్ పార్కులో హైదరాబాద్ జూ జూస్టాస్టిక్ సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు క్యూరేటర్ తెలిపారు. మే మొదటి వారంలో ప్రారంభమై జూన్ వరకు ఈ సమ్మర్ క్యాంపు ఉంటుందన్నారు. 5 నుంచి పదవ తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. ఒక్కరికి రూ.1000 ఫీజు ఉంటుందని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. క్యాంప్‌లో జూ టూర్, సరీసృపాల అవగాహన సెషన్, నైట్ హౌస్ సందర్శన, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు.

News April 23, 2025

OU: బీ ఫార్మసీ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ కోర్సు పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీ ఫార్మసీ(పీసీఐ) సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు. -SHARE IT..

News April 22, 2025

‘హజ్ యాత్రికులకు మెరుగైన సదుపాయాలు కల్పించండి’

image

హజ్ హౌస్‌లో రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాష అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 11,000 మంది హజ్ యాత్రికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఏప్రిల్ 29 నుంచి మే 29 వరకు విమానాలు మదీనా, జిద్దా వెళ్లనున్నాయి. జూన్ 12 నుంచి జూలై 9 వరకు తిరుగు ప్రయాణాల షెడ్యూల్ ఉంది.

error: Content is protected !!