News August 19, 2024

HYD: వాహనదారులకు రాఖీ కట్టిన మహిళా పోలీసులు

image

HYD నగరంలోని రాచకొండ ట్రాఫిక్ మహిళా పోలీసులు వివిధ ప్రాంతాలలో రాఖీ పండుగ సందర్భంగా వాహనదారులకు రాఖీ కట్టారు. రాఖీ రక్షణకు గుర్తింపు అని మహిళా పోలీసులన్నారు. అనంతరం ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. వాహనదారులందరూ సంతోషంగా, క్షేమంగా గమ్యానికి చేరుకోవాలని కోరుకున్నట్టు తెలిపారు.

Similar News

News December 19, 2025

ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ ఫీస్ట్–2025.. ట్రాఫిక్ ఆంక్షలు

image

ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న క్రిస్మస్ ఫీస్ట్–2025 కార్యక్రమం నేపథ్యంలో డిసెంబర్ 20న సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం, ఏఆర్ పెట్రోల్ పంప్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించి, పోలీసులకు సహకరించాలని సూచించారు.
SHARE IT

News December 19, 2025

HYDలో బ్రెడ్ క్రంబింగ్‌ ట్రెండ్.. బకరాలు లోడింగ్! ​

image

సిటీలో ప్రేమ ‘పెళ్లి’ దాకా వెళ్లడం లేదు.. గాల్లో దీపం పెట్టినట్లే ఉంది. పబ్‌లో పార్టీలు చేసుకుంటూ ఎదుటి మనిషికి అప్పుడప్పుడు ఓ మెసేజ్ పంపి, వాళ్లు రిప్లై ఇస్తే మళ్లీ రెండు రోజులు సైలెంట్ అయిపోవడమే ఈ కొత్త ట్రెండ్. తమ చుట్టూ తిప్పుకోవడానికి వేసే బిస్కెట్లు ఇవి. ఈ ట్రాప్‌లో పడి చాలా మంది మనసులు ముక్కలవుతున్నాయి. సో.. HYD యూత్.. ఆ ‘హాఫ్-హార్టెడ్’ లైకులను చూసి మురిసిపోకండి. బకరాగా మిగలకండి.

News December 19, 2025

హైదరాబాద్‌లో పెను మార్పు

image

గ్రేటర్‌ హైదరాబాద్ పాలనలో పెను మార్పులకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. పురపాలక శాఖకు (MA&UD) ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలను నియమించాలని యోచిస్తోంది. వీరి పరిధిని (Jurisdiction) స్పష్టంగా విభజిస్తూ.. ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఒకరు, బయట ప్రాంతాలపై మరొకరు బాధ్యతలు చేపట్టనున్నారు. భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్న వేళ ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.