News August 22, 2025

HYD: వింటూనే ఉన్నాం.. ఎప్పుడు చూస్తామో!

image

ప్రత్యేక తెలంగాణ వచ్చి నేటికి 11ఏళ్ల 2 నెలల 20 రోజులైంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఓ పదం వింటూనే ఉన్నాం.. ‘మూసీని అభివృద్ధి చేస్తాం’ అని. ఈ పదం వినీ.. వినీ నగరవాసికి విసుగెత్తిపోయింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇపుడు కాంగ్రెస్ సర్కార్‌కు ఈ పదం పలకడం అలవాటైపోయింది. మూసీని అభివృద్ధి చేయకుండా.. చేస్తాం, చేస్తాం అని ఇంకెన్నేళ్లు చెబుతారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News August 22, 2025

కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను హత్య చేసిన బాలుడు!

image

కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో బాలిక సహస్ర హత్య కేసు కీలక మలుపు తిరిగింది. 5వ రోజు కేసును ఛేదించిన పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్న 10వ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. దొంగతనానికి వెళ్లిన సమయంలో బాలికను చూసి హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 22, 2025

టేకులపల్లిలో రూ.2.12 కోట్ల గంజాయి పట్టివేత

image

ఇల్లందు DSP ఆదేశాల మేరకు టేకులపల్లిలోని వెంకిట్యాతండ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. లారీపై అనుమానం వచ్చి తనిఖీచేయగా రూ.2.12 కోట్ల విలువ గల 424 కిలోల గంజాయి లభ్యమైంది. లారీలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. రాజస్థాన్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు నేరం ఒప్పుకున్నారని DSP తెలిపారు. వారి నుంచి 2 సెల్‌ఫోన్‌లు, గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.

News August 22, 2025

కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీ

image

TG: ఎర్రవల్లిలోని తన నివాసంలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కేసీఆర్ సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో <<17482025>>విచారణ <<>> జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తదుపరి కార్యాచరణపై హరీశ్ సహా మిగతా బీఆర్ఎస్ నేతలతో గులాబీ దళపతి సమాలోచనలు చేస్తున్నారు.