News August 22, 2025

HYD- విజయవాడకు E-గరుడలో 26% డిస్కౌంట్

image

HYD-విజయవాడ మార్గంలో ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మార్గంలో ఈ-గరుడ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరపై 26% రాయితీ ప్రకటించింది. ఈ- గరుడ బస్సులు కాలుష్య రహితమైనవని, పర్యావరణహితమైనవని, 100% సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని RTC అధికారులు తెలిపారు. ఈ మార్గంలో TGSRTC 10 ఈ-గరుడ బస్సులను నడుపుతోంది.

Similar News

News August 22, 2025

నిజాం నిరంకుశత్వాన్ని నిలదీశారు షోయబ్ ఉల్లాఖాన్

image

షోయబ్ ఉల్లాఖాన్ 1920 OCT 17న ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించారు. ఆయన HYDలో ఎక్కువ రోజులు గడిపారు. ఓయూలో జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందారు. నగరంలో వెలువడే ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాశారు. నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో 1948 ఆగష్టు 22న రజాకార్లు అతిక్రూరంగా కాల్చిచంపారు. HYDలోనే ఆయన చివరి శ్వాస విడిచారు.

News August 22, 2025

నగర వాసి దాహం తీర్చేందుకు జలమండలి కసరత్తు

image

మహానగరంలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇపుడు మరో 6 రిజర్వాయర్లు నిర్మించనుంది. ఆస్మాన్‌ఘడ్‌లో 2 నిర్మించనుండగా మహేంద్రహిల్స్‌లో ఒకటి, నియో పోలీస్‌లో 3 నిర్మించనుంది. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో 15 రిజర్వాయర్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 297 రిజర్వాయర్లు నగరవాసి దాహాన్ని తీర్చుతున్నాయి.

News August 22, 2025

మిర్యాలగూడ- కాచిగూడ ట్రైన్ 20 MIN లేట్

image

మిర్యాలగూడ- కాచిగూడ సమయాన్ని మారుస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మిర్యాలగూడ ప్యాసింజర్ రైలు (77648)  కాచిగూడ స్టేషన్‌కు గతంలో ఉన్న సమయం కంటే మరో 20 MIN లేట్‌గా వస్తుంది. గతంలో రోజూ 10 గంటలకు వస్తుండగా మారిన సమయం అనంతరం రా.10:20కు వస్తుందని తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు.