News August 22, 2025
HYD- విజయవాడకు E-గరుడలో 26% డిస్కౌంట్

HYD-విజయవాడ మార్గంలో ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మార్గంలో ఈ-గరుడ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరపై 26% రాయితీ ప్రకటించింది. ఈ- గరుడ బస్సులు కాలుష్య రహితమైనవని, పర్యావరణహితమైనవని, 100% సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని RTC అధికారులు తెలిపారు. ఈ మార్గంలో TGSRTC 10 ఈ-గరుడ బస్సులను నడుపుతోంది.
Similar News
News August 22, 2025
చాపాడు PSను తనిఖీ చేసిన జిల్లా SP

చాపాడు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని SI చిన్న పెద్దయ్యను ఆదేశించారు. ఉమెన్ హెల్ప్ డెస్క్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
News August 22, 2025
‘Mega158’ కాన్సెప్ట్ పోస్టర్ చూశారా?

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేళ డైరెక్టర్ బాబీతో తీస్తోన్న ‘Mega158’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఆయనతో రెండో సారి కలిసి పనిచేయడం గర్వంగా ఉందంటూ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను బాబీ షేర్ చేశారు. గొడ్డలి వేటుతో రక్తపు ధార కిందకు వచ్చినట్లుగా పోస్టర్‌లో చూపించారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చిరు బర్త్ డే సందర్భంగా 3 సినిమాల అప్డేట్స్ రావడం విశేషం.
News August 22, 2025
చైనాకు వెళ్లే దేశాధినేతల్లో మోదీ, పుతిన్

చైనాలోని తియాంజిన్ వేదికగా ఈ నెలాఖరున షాంఘై సహకార సదస్సు(SCO) జరగనున్న విషయం తెలిసిందే. అయితే హాజరయ్యే 20 మంది ప్రపంచ నేతల్లో మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నట్లు చైనా తెలిపింది. SCO చరిత్రలో ఇదే భారీ సమావేశం అని చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి ల్యూ బిన్ వెల్లడించారు. US భారీ సుంకాల నేపథ్యంలో చైనాతో భారత్ దౌత్య సంబంధాలు ఇప్పుడిప్పుడే మెరుగవుతుండగా, మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.