News February 19, 2026

HYD- విజయవాడ జస్ట్ 2.5 Hrs: మంత్రి!

image

రాష్ట్ర రోడ్ల నెట్‌వర్క్ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి, RRR, NH-65 (8 లేన్ల విస్తరణ) ప్రాజెక్టులే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ఈ పనులు పూర్తైతే HYDకు విజయవాడ 2.5 గంటల్లో వెళ్లేలా చేరువకానుంది. హ్యామ్ (HAM) విధానంలో అద్దంలాంటి రోడ్ల నిర్మాణమే ధ్యేయమని, కేంద్ర నిధుల రాకపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 19, 2026

HYD: రేపటి నుంచి జలమండలి బస్తీబాట

image

జలమండలి ప్రజలతో మమేకమయ్యే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జలమండలి.. బస్తీ బాట పేరుతో శుక్రవారం నుంచి వారానికి 4 రోజులు బస్తీలు, కాలనీల్లో అధికారులు ప్రత్యక్షంగా పర్యటించనున్నారు. ఎండీ నుంచి వార్డు మేనేజర్ల వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి నీరు, సీవరేజ్ సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టనున్నారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అధికారులు తెలిపారు.

News February 19, 2026

హస్తినలో జగ్గారెడ్డి ‘కమ్మ’ రాయబారం!

image

TGలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు మార్చి16న ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీలో కాంగ్రెస్‌కి ఉన్న మెజారిటీతో వారి ఖాతాలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. VH అధిష్ఠానానికి లేఖ రాయగా, కీలక నేతలూ ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన జెట్టి కుమార్‌కు అన్యాయం జరిగిందని, ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి గట్టిగా కోరుతున్నారు.

News February 19, 2026

వికారాబాద్‌ కొండలపై ఏపీ DCCలకు ట్రైనింగ్

image

హైదరాబాద్ శివారు ప్రాంతమైన అనంతగిరి గుట్టపై ఏపీకి చెందిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ టి.కాంగ్రెస్‌కు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణతోపాటు ఏపీ డీసీసీ అధ్యక్షుడు ఈ నెల 21 నుంచి జరిగే శిక్షణలో పాల్గొంటారు. ఏపీ నుంచి 41 మంది, తెలంగాణ నుంచి 36 మంది ఈ ట్రైనింగుకు హాజరవుతారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఆఖరి రోజు రాహుల్ గాంధీ వచ్చే అవకాశముంది.