News August 23, 2025

HYD: ‘విత్తన గణేశ్’లను పంపిణీ చేస్తున్న ‘ఫ్రీడమ్ ఆయిల్స్’

image

ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్, జెమిని ఎడిబుల్స్& ఫ్యాట్స్ ఇండియా Ltd పర్యావరణ హితం 10వేల విత్తన గణేశ్‌ పెట్టలను పంపీణీ చేస్తున్నట్లు ప్రకటించాయి. 5వేలు HYDలో మరో 5వేలు బెంగళూరులో పంపీణీ చేయనున్న వాహనాలను ఫ్రీడమ్ ఆయిల్స్ DGM చేతన్ పింపాల్ ఖుటే జెండా ఊపి ప్రారంభించారు. రిడ్జ్ టవర్స్, మైహోమ్ జ్యువెల్, వన్ సిటీ, సాయిమిత్రా టవర్స్, కృష్ణకుంజ్ గార్డినియా, మలేషియన్ టౌన్‌షిప్స్ పలు చోట్ల పంపిణీ చేస్తారు.

Similar News

News September 13, 2025

యాకుత్‌పురా ఘ‌ట‌న‌కు.. బాధ్యుల‌పై హైడ్రా చ‌ర్య‌లు

image

యాకుత్‌పురా మౌలకా చిల్కాలోనీ మ్యాన్ హోల్లో చిన్నారి ప‌డిపోయిన ఘ‌ట‌న‌ను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది. దీనిపై హైడ్రా క్షుణ్నంగా విచారించింది. బుధ‌వారం సిల్ట్‌ను తొల‌గించ‌డానికి తెర‌చిన మ్యాన్ హోల్ మూయ‌క‌పోవ‌డంతో గురువారం పాఠశాలకు వెళ్తున్న చిన్నారి అందులో ప‌డిపోయిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో డీఆర్ ఎఫ్ సూప‌ర్‌వైజర్లు ఇద్ద‌రికి డిమోషన్, ఇద్ద‌రిని తొల‌గించాలని ఆదేశించింది.

News September 12, 2025

HYD: మిలాద్ ఉన్ నబి వేడుకల్లో డీజేలు నిషేధం

image

చార్మినార్ PS పరిధిలోని సనా గార్డెన్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీసీపీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, ఆర్‌&బీ విభాగాల అధికారులు, సుమారు 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. డీజేలు, పటాకులు నిషేధం అని డీసీపీ స్పష్టం చేస్తూ, కార్యక్రమాలు ప్రశాంతంగా, సమయానికి ముగించాలని తెలిపారు.

News September 12, 2025

GHMC, హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు

image

GHMC, హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర రూ.వంద కోట్ల విలువైన స్థలానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హౌసింగ్ సొసైటీకి ఆదేశలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.