News December 6, 2024

HYD: విద్యార్థుల ఇంటికి హెడ్ మాస్టర్

image

విద్యాశాఖ అధికారుల చొరవతో స్కూల్ HMలు నేరుగా విద్యార్థుల ఇంటికొస్తున్నారు. వికారాబాద్ జిల్లా దోమ మం. MEO వెంకట్ సూచనతో దాదాపూర్ GOVT స్కూల్ HM కృష్ణయ్య, ఉపాధ్యాయులు వెంకటయ్య, యాదగిరి, రాజేశ్ గురువారం రాత్రి విద్యార్థుల ఇంటికెళ్లారు. పిల్లలు చదువుతున్నారా? లేదా? అని ఆరా తీశారు. హోంవర్క్‌ను పరిశీలించి, పేరెంట్స్ శ్రద్ధ చూపాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల HMలు ఇలా చొరవ తీసుకుంటే ఎలా ఉంటుంది? మీ కామెంట్?

Similar News

News September 15, 2025

రాంనగర్‌లో మృత్యు నాలాలు!

image

భారీ వర్షం వస్తే ప్రాణాలు పోతున్నాయి. వరద ఉద్ధృతికి నాలా ప్రహరీలు పేక మేడళ్ల కూలిపోతున్నాయి. ఇది ఎప్పుడో ఒకసారి అయితే ఏమో అనుకోవచ్చు. ముషీరాబాద్, రాంనగర్‌‌లో ప్రతి ఏడాది ఇదే తంతు. నిన్న వినోభానగర్‌లో యువకుడు సన్నీ గల్లంతు ఆందోళనకు దారి తీసింది. అధికారులు తూ తూ మంత్రంగా చర్యలు తీసుకొన్నారని బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ అతడి ఆచూకీ తెలియలేదని, గాలింపు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు.

News September 15, 2025

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం: HYD కలెక్టర్

image

వరద కారణంగా మృతిచెందిన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తామని కలెక్టర్ హరిచందన వెల్లడించారు. బాడీ దొరికిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వరద ఉద్ధృతి పెరిగే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని నాళాలపై నిర్మాణాలు జరుగుతుండటంతో ప్రమాదాలు తలెత్తుతున్నాయని, అలాంటి నిర్మాణాలపై చర్యలు తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు.

News September 15, 2025

HYD: ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

image

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలపై ప్రైవేట్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 20 రోజులుగా పెండింగ్ బకాయిలపై ప్రభుత్వంతో అంతర్గత చర్చలు జరిపింది. అనంతరం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ప్రైవేటు ఆస్పత్రుల నిర్ణయం తీసుకున్నాయి. పెండింగ్‌లో ఉన్న బకాయిల్లో రూ.140 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.