News May 15, 2024

HYD: విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్

image

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ఇంత వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ HYDలో ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి విద్యాశాఖ మంత్రిని నియమించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.మంత్రి లేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

Similar News

News October 6, 2024

HYD: మోసాలకు అడ్డా.. ‘గోల్డెన్ ట్రయాంగిల్’

image

HYD మహా నగరంలో ఆన్‌లైన్ మోసాలతో రూ.కోట్లు మాయమవుతున్న ఘటనలు బయటపడ్డాయి. BHEL టౌన్షిప్‌ విశ్రాంత ఉద్యోగి ఖాతా నుంచి రూ.13.16 కోట్లు, KPHB వైద్యుడి నుంచి రూ.8.6 కోట్లు, నోయిడా వ్యాపారి అకౌంట్ నుంచి రూ.9.09 కోట్లు మాయమయ్యాయి. ఈ సొమ్ము ‘గోల్డెన్ ట్రయాంగిల్’గా పిలిచే థాయ్‌లాండ్ , లావోస్, మయన్మార్ దేశాల్లోని ముఠాల చేతుల్లోకి వెళ్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది.

News October 6, 2024

HYD: 2,525 చెరువులకు హద్దులు ఖరారు

image

HYD మహా నగరంలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని పర్యావరణవేత్తలు FTL, బఫర్ జోన్లను నిర్ధారించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెచ్ఎండీఏలోని 3,532 చెరువుల్లో 230కి మాత్రమే బఫర్ జోన్ నిర్ధారించారు. 2,525 చెరువులకు హద్దులు ఖరారు చేశారు. కాగా మరో 1,000 చెరువులకు 3 నెలల్లో హద్దులను నిర్ధారించాల్సి ఉంది.

News October 5, 2024

BREAKING: HYD: ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ SUSPEND

image

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ సైదులును సస్పెండ్ చేస్తూ శనివారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్ గడ్డం మహేశ్ హత్య కేసులో డబ్బులు తీసుకుని ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించాడనే ఆరోపణల నేపథ్యంలో మహేశ్ తరఫు బంధువులు రెండు రోజుల క్రితం సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.