News February 24, 2025

HYD: ‘విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో బందీ’

image

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో బందీ అయిందని ప్రొ.వెంకటదాస్ చెప్పారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ అవిర్భావ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా డీఏటీఏ ఆవిర్భవించడం ఆనందాయకమన్నారు. యుటీసీ, ఏఐసీటీ, ఎఫ్ఎస్ఆర్సీ నిబంధనలను పాటించకుండా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.

Similar News

News September 14, 2025

బాపట్ల జిల్లా మూడో ఎస్పీగా ఉమామహేశ్వర్

image

నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో మూడవ ఎస్పీగా ఉమామహేశ్వర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. బాపట్ల జిల్లాలో తొలి ఎస్పీగా వకుల్ జిందాల్, రెండో ఎస్పీగా తుషార్ డూడి బాధ్యతలు నిర్వహించి బదిలీ అయ్యారు. మూడో ఎస్పీగా ఉమామహేశ్వర్ ఆదివారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారని పోలీస్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నూతన ఎస్పీకి స్వాగతం పలికేందుకు పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టారు.

News September 14, 2025

రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు: MHBD SP

image

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని ఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌ సూచించారు. అవసరమైన యూరియా, ఇతర ఎరువులు అన్ని ప్రాంతాలకు పంపిణీ జరుగుతున్నాయన్నారు. అందుబాటులో ఉన్న స్టాక్‌ను బట్టి అన్ని మండలాలకు సరఫరా జరుగుతుందని, ప్రతి రైతుకు అవసరమైన యూరియా సంచులు అందజేయబడతాయని హామీ ఇచ్చారు. బైకులపై యూరియా బస్తాలు తీసుకెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రయాణించాలని సూచించారు.

News September 14, 2025

యానిమల్ లవర్స్‌పై ప్రధాని మోదీ సెటైర్లు

image

ఢిల్లీలో ఇటీవల వీధి కుక్కల తరలింపును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యానిమల్ లవర్స్ ఉద్యమించిన విషయం తెలిసిందే. వారి డబుల్ స్టాండర్డ్స్‌పై ప్రధాని మోదీ రీసెంట్‌గా ఓ ఈవెంట్లో సెటైర్లు వేశారు. ‘నేను ఇటీవల కొంతమంది యానిమల్ లవర్స్‌ను కలిశాను. మన దేశంలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వారిలో ఎక్కువ మంది ఆవులను యానిమల్‌గా పరిగణించరు’ అని వ్యాఖ్యానించారు.