News August 23, 2025

HYD: వినాయక చవితి.. పోలీసుల సూచనలు

image

గణపతి ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఉ.6 గంటల నుంచి రా.10 గంటల వరకు మాత్రమే భక్తిగీతాలను మాత్రమే వినిపించాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు సూచించారు. డీజే, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు నిషేధమని, శోభాయాత్రలు, ర్యాలీలు, పాదయాత్రల నేపథ్యంలో సున్నితమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతాలపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు బందోబస్తు చేపట్టనున్నామని చెప్పారు.

Similar News

News August 23, 2025

రేపటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్

image

ఢిల్లీ అసెంబ్లీ భవనంలో ఆది, సోమవారాల్లో ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ 2 రోజుల సదస్సును హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. సోమవారం ముగింపు కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల సభాపతులతో పాటు మరో 30 మంది స్పీకర్లు పాల్గొననున్నారు.

News August 23, 2025

స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిటీ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్, భట్టి, పొన్నం, సీతక్క సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 28వ తేదీ లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు, ఈ నెల 29న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని PAC భేటీలో నిర్ణయించారు.

News August 23, 2025

తిరుపతి: ఒకే వ్యక్తికి 5 ప్రభుత్వ ఉద్యోగాలు

image

పుత్తూరుకు చెందిన వ్యక్తి 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. గజేంద్ర, రత్న దంపతులకు మహేష్, వినోద్, మోహన్ ముగ్గురు సంతానం. చిన్నతనంలో భర్తను కోల్పోయిన ఆమె తన తల్లి వద్ద ముగ్గురిని వదిలి కువైట్‌కు జీవనోపాధి కోసం వెళ్లింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన మోహన్ SA సోషల్‌లో 23వ ర్యాంకు, తెలుగులో 27, SGTలో 26, TGT లో 35వ ర్యాంకు సాధించారు. ఇటీవల వచ్చిన కానిస్టేబుల్ ఫలితాల్లో సైతం 3వ ర్యాంకు వచ్చింది.