News August 23, 2025
HYD: వినాయక చవితి.. పోలీసుల సూచనలు

గణపతి ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఉ.6 గంటల నుంచి రా.10 గంటల వరకు మాత్రమే భక్తిగీతాలను మాత్రమే వినిపించాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు సూచించారు. డీజే, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు నిషేధమని, శోభాయాత్రలు, ర్యాలీలు, పాదయాత్రల నేపథ్యంలో సున్నితమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతాలపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు బందోబస్తు చేపట్టనున్నామని చెప్పారు.
Similar News
News August 23, 2025
HYD: దొంగ ఓట్లతో మోదీ PM అయ్యాడు: వీహెచ్

ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ MP వి.హనుమంతరావు అన్నారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు, అంబర్‌పేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డా.సి.రోహిణ్ రెడ్డితో కలిసి అంబర్‌పేటలోని అలీ కేఫ్ చౌరస్తా నుంచి పటేల్ నగర్ వరకు ఆయన ‘ఓట్ బచావో’ ర్యాలీని ఈరోజు నిర్వహించారు. దొంగ ఓట్లతో మోదీ పీఎం కావడం సరికాదని, ప్రజల మధ్యకు వెళ్లి ఓట్లు వేయించుకోవడం గొప్ప అని అన్నారు.
News August 23, 2025
FLASH: యాక్సిడెంట్‌లో శంకర్‌పల్లి వాసి మృతి

బైక్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సంగారెడ్డి(D) కొండాపూర్ PS పరిధిలో జరిగింది. SI సోమేశ్వరి తెలిపిన వివరాలు.. శంకర్‌పల్లి మండలం గాజులగూడ వాసి కొత్తగొల్ల రాములు(50) శనివారం పొలానికి వెళ్లి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా గుంతపల్లి శివారులో వేగంగా వచ్చిన టిప్పర్ అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో రాములు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి కొడుకు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News August 23, 2025
FLASH: HYD: లింగంపల్లిలో ట్రావెల్ బస్ బ్రేక్ ఫెయిల్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ట్రిపుల్ ఐటీ వెళ్లే మార్గంలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. మజీద్ బండ జంక్షన్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరగలేదని, అయితే కాస్త ట్రాఫిక్ జామవగా పోలీసులు వచ్చి క్లియర్ చేశారన్నారు. డ్రైవర్ చాకచక్యంతో బస్సును నడపడంతో పెను ప్రమాదం తప్పింది.