News April 21, 2025

HYD: విభిన్న వాతవరణం.. 3 రోజులు జాగ్రత్త..!

image

హైదరాబాద్‌లో రోజు రోజుకూ ఎండలు ఎక్కువవుతున్నాయి. HYD, MDCLలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదవుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా, సాయంత్రం వర్షం పడుతోంది. ఉదయం 7 గంటల నుంచే వేడిమి అధికంగా ఉంటుంది. నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Similar News

News July 8, 2025

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News July 8, 2025

కాంగ్రెస్ HYD, RR జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు

image

TGలో కాంగ్రెస్ సంస్థాగత పునర్నిర్మాణం దిశగా కీలక అడుగు వేసింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. AICC TG ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదంతో జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. HYD జిల్లాకు జగ్గారెడ్డి, ఉమ్మడి RRకు శివసేనా రెడ్డిని నియమించారు. వీరి నియామకంతో అధికార పార్టీకి సిటీ, శివారులో పట్టు దొరుకుతుందని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News July 8, 2025

విఠలేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్సీ కవిత

image

పురాణాపూల్‌లోని విఠలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం జరిగిన కళ్యాణోత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయ నిర్వహణపై ఆలయ పూజారులతో ఆమె చర్చించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.