News December 22, 2025
HYD: విలీనం.. జనంపై రూ.800 కోట్ల భారం!

ULBs విలీనంతో అభివృద్ధి సంగతేమోగానీ, పన్నుల వసూళ్లే లక్ష్యంగా కనిపిస్తోంది. 27 మున్సిపాలిటీల పరిధిలోని 8 లక్షల ప్రాపర్టీస్ గ్రేటర్ పరిధిలోకి తెచ్చారు. రూ.800 కోట్ల అదనపు పన్ను వసూలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.3,100 కోట్లకు పన్ను వసూళ్లు చేరనున్నాయని అధికారులు Way2Newsకు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ పన్నుల వసూలును పూర్తి చేయాలని వేగంగా పావులు కదుపుతున్నారు.
Similar News
News December 24, 2025
మెదక్ ఎస్పీకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ శ్రీఎస్.మహేందర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీలు నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, ప్రసన్న కుమార్, రంగా నాయక్, సీఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
News December 24, 2025
95 లక్షల మంది ఓటర్లు తొలగింపు!

3 రాష్ట్రాలు, ఒక UTలో SIR తర్వాత 95 లక్షల మంది ఓటర్లను తొలగించారు. MPలో 42.74 లక్షల మంది, కేరళలో 24.08 లక్షల మంది పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో కనిపించలేదు. ఛత్తీస్‌గఢ్‌లో 27.34 లక్షల మంది, అండమాన్&నికోబార్‌లో 3.10 లక్షల మంది ఓటర్లలో 64,000 మందికి చోటు దక్కలేదు. తమ ఐడెంటిటీని వ్యక్తిగతంగా చూపించి FEB 21, 2026న ప్రచురించే తుది జాబితాలో పేర్లను చేర్చుకోవడానికి ఈ ఓటర్లకు వారం రోజుల టైం ఇచ్చారు.
News December 24, 2025
గుడివాడలో విచ్చలవిడిగా మెడికల్ షాపులు..!

గుడివాడలో విచ్చలవిడిగా మెడికల్ షాపులు పెరిగిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని షాపుల్లో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారని, అనుభవం లేని అర్హత లేని వ్యక్తులు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకొనే వారికి యాంటీబయోటిక్ మందులను విక్రయిస్తున్నారంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


