News July 29, 2024
HYD: వివాహిత అనుమానస్పద మృతి

మెడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. ఉప్పల్ PS పరిధి రామంతపూర్‌లోని వెంకట్ రెడ్డి నగర్‌లో 4 అంతస్థుల భవనం నుంచి దూకి దివ్య(29) అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అంబర్పేట్ ప్రేమ్ నగర్‌కు చెందిన దివ్యకు రామంతపూర్ రామ్ రెడ్డి నగర్‌కు చెందిన నవీన్‌తో ఏప్రిల్ 24, 2024న పెళ్లైంది. ఈనెల 27న దివ్య మిస్ ఐనట్లు పుట్టింటి వారికి చెప్పారు. నేడు ఆత్మహత్య చేసుకోవడంతో అనుమానాలు వ్యక్తం చేశారు.
Similar News
News February 16, 2026
BREAKING: కడ్తాల్ వద్ద రెండు కార్లు ఢీ.. ఇద్దరి దుర్మరణం

కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్కల్ పహాడ్ గేట్ సమీపంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. NH 765పై రెండు కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న నరేంద్ర చారి (37), ఎస్‌కే సైదులు (30) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 13, 2026
BREAKING: రంగారెడ్డిలో హోరాహోరి.. ఫలితాలు ఇవే!

రంగారెడ్డిలోని 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, BRS హోరాహోరీగా నిలిచాయి. మొత్తం 6 మున్సిపాలిటీల్లో 126 వార్డులు ఉండగా 54 కాంగ్రెస్, 47 బీఆర్ఎస్, 16 బీజేపీ, 9 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఆమన్‌గల్ BRS, ఇబ్రహీంపట్నం BRS, షాద్‌నగర్ INC, శంకర్‌పల్లి INC, చేవెళ్లలో INC సత్తాచాటాయి. మొయినాబాద్ ఒక్క చోట హంగ్ ఏర్పడింది. అటు మేడ్చల్‌లోని అలియాబాద్ మున్సిపాలిటీలోనూ హంగ్ వచ్చింది.