News September 24, 2025
HYD: ‘విశ్వనగరం అంటే నవ్వుతున్నారు..!’

HYDను విశ్వనగరం చేస్తామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారని, కానీ ఒకసారి కార్లు దిగి రోడ్ల పరిస్థితి చూడాలని ప్రజలు అంటున్నారు. ఉప్పల్-నారపల్లి, JBS-కార్ఖానా-అల్వాల్, బంజారాహిల్స్ తదితర చోట్ల రోడ్లు దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు. రోడ్లను చూసి విశ్వనగరం అంటే బయట నవ్వుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఏడాదిగా అవస్థలు పడుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. మీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News September 24, 2025
రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం: జగదీశ్ రెడ్డి

రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని సీఎం రేవంత్ అరాచక పాలన చేస్తున్నాడని ధ్వజమెత్తారు. లాఠీచార్జి బాధితుడు సాయి సిద్ధూను అతని స్వగ్రామమైన దామరచర్ల మండలం కొత్తపేటతండాలో ఎంఎల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భూపాల్ రెడ్డి, భగత్‌తో కలిసి పరామర్శించారు.
News September 24, 2025
ఎమర్జెన్సీ నంబర్లు.. సేవ్ చేసుకోండి

అత్యవసర సమయంలో కింది ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేసి ప్రాణాలు కాపాడుకోవచ్చు.
*112- అన్ని అత్యవసర పరిస్థితుల్లో దీనికి కాల్ చేయవచ్చు. (పోలీసులు, అంబులెన్స్, ఫైరింజన్)
*100- పోలీసులు
*101- అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీక్
*102- గర్భిణులు, పిల్లలకు ఫ్రీ అంబులెన్స్ *108- మెడికల్ ఎమర్జెన్సీ *1091- మహిళల వేధింపులకు హెల్ప్ లైన్ *1930- డిజిటల్ మోసాలను రిపోర్ట్ చేయవచ్చు
News September 24, 2025
పహల్గాం ఉగ్రదాడి.. టెర్రరిస్టులకు సహకరించిన వ్యక్తి అరెస్ట్!

పహల్గాం ఉగ్రదాడిలో టెర్రరిస్టులకు సాయం చేసినట్లు భావిస్తున్న ఓ వ్యక్తిని J&K పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆపరేషన్ మహదేవ్‌లో ఇటీవల పలువురు టెర్రరిస్టులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఘటనాస్థలిలో సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలను బేస్ చేసుకొని మహ్మద్ కటారియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు ఇతడి అరెస్టు కీలకమని పోలీసులు భావిస్తున్నారు.