News February 4, 2025
HYD: విషప్రచారం చేసిన రేవంత్ రెడ్డి: BRS
CM రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై విషప్రచారం చేశారని BRS పార్టీ పేర్కొంది. ‘కాళేశ్వరం కూలిపోయింది, ఎందుకూ పనికిరాదంటూ విషప్రచారాలు చేసిన రేవంత్ & కో.. నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు 20టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. మరి నువ్వు పనికిరాదన్న ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎలా వస్తున్నాయి రేవంతూ? ఇప్పటికైనా.. ఎప్పటికైనా తెలంగాణ ప్రజల కల్పతరువు కాళేశ్వరమే’ అంటూ ట్వీట్ చేసింది.
Similar News
News February 4, 2025
HYD: గన్ ప్రాక్టీస్.. కుక్కను చంపిన ప్రభాకర్!
HYD గచ్చిబౌలిలోని ప్రీజం పబ్‌లో పోలీసులపై కాల్పుల జరిపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ గురించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. రూ. 10 లక్షలు పెట్టి 3 గన్లు, 500 బుల్లెట్లు కొన్న ప్రభాకర్.. ప్రాక్టీస్‌లో భాగంగా ఓ కుక్కను చంపినట్లు తెలుస్తోంది. బిజినెస్ అంటూ బిల్డప్ ఇస్తూ HYDలో మకాం వేశాడు. తాజాగా కాల్పులు జరిపి దొరికిపోయాడు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది.
News February 4, 2025
మేడ్చల్: స్కూల్ గేట్ బంద్.. గోడలు దూకిన స్టూడెంట్స్
స్కూల్ గేట్లు సమయానుసారంగా తెరవకపోవడంతో విద్యార్థులు గోడలు దూకుతున్నారు. మేడ్చల్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ పరిస్థితి దాపురించింది. విద్యార్థులు పాఠశాల సమయానికి చేరుకున్నప్పటికీ గేట్లు తెరవలేదు. కొందరు పిల్లలు గోడలు దూకి మరీ లోపలికి వెళ్లారు. ఈ దృశ్యాలను తల్లిదండ్రులు ఫొటోలు తీశారు. కిందపడితే ఎవరు బాధ్యులు అని.. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
News February 3, 2025
నులిపురుగుల మాత్రలు పక్కగా పంపిణీ చేయాలి: కలెక్టర్
నులిపురుగుల నివారణ మాత్రలు పక్కాగా పంపిణీ చేయాలనీ కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి ఆదేశించారు. 1-19 ఏళ్ల వారందరికీ ఈ నెల 10న తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అల్బెన్డజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని ఆదేశించారు.