News January 29, 2026
HYD: వీకెండ్‌లో బెస్ట్ డెస్టినేషన్.. జింకల పార్కు

తెలంగాణ పర్యాటక మణిహారంలో మరో మెరిసే రత్నం చేరబోతోంది. భాగ్యనగరవాసుల వీకెండ్ డెస్టినేషన్ శామీర్‌పేట జింకల పార్కును రూ.1.15 కోట్లతో సర్కారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. వందకు పైగా చుక్కల జింకలు, రాజసం ఒలికించే కృష్ణజింకల గంతులతో ఈ అడవి పులకించనుంది. కాంక్రీట్ జంగిల్‌లో అలసిపోయిన మనసులకు ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదాన్ని అందించే ఈ ప్రాజెక్టు పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తుంది.
Similar News
News February 9, 2026
SA భారీ స్కోర్.. కెనడా టార్గెట్ ఎంతంటే?

T20WC: కెనడాతో మ్యాచ్‌లో SA బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 20 ఓవర్లలో 213/4 రన్స్ చేశారు. కెప్టెన్ మార్క్రమ్(59) అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశారు. మిల్లర్(39), స్టబ్స్(34), రికెల్టన్(33), డికాక్(25) రాణించారు. SA బ్యాటర్లను కట్టడి చేయడంలో కెనడా బౌలర్లు తేలిపోయారు. అన్ష్ పటేల్ 3 వికెట్లు, దిల్‌ప్రీత్ భాజ్వా ఒక వికెట్ తీశారు. విజయం కోసం కెనడా 20 ఓవర్లలో 214 పరుగులు చేయాలి.
News February 9, 2026
పీఎంశ్రీ పాఠశాలలపై వరంగల్ కలెక్టర్ సమీక్ష

పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన విద్యాలయాల పనితీరుపై వరంగల్ కలెక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 16 పాఠశాలలు ఈ పథకం కింద కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాలు, నిర్వహణ తీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ పాఠశాలల్లో విజ్ఞాన విహార యాత్రలు, యోగా శిక్షణ తరగతులు, సైన్స్ ఫెయిర్‌లు తదితర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.
News February 9, 2026
20 జోన్లుగా పారిశుద్ధ్య నిర్వహణ: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

వేములవాడలో మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ కోసం పట్టణాన్ని 20 జోన్లుగా విభజించినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. జాతర సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపాలిటీ, ఆలయ అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కో జోన్‌కు ఒక్కో పంచాయతీ కార్యదర్శిని ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు తెలిపారు.


