News July 3, 2024

HYD: వీరిలో ఒకరికి మంత్రి పదవి?

image

ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. దీంతో మంత్రి పదవి కోసం RR జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి, HYD నుంచి ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చేతి గుర్తుపై గెలిచిన వారికే మంత్రి పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించిందని ఇటీవల సీఎం చెప్పడంతో దానం ఆశలు సన్నగిల్లాయి. కాగా గతంలో దానంకు రేవంత్ రెడ్డి మాట ఇవ్వడంతో ఆశతో ఉన్నారు.

Similar News

News November 4, 2025

వారంలో 3-5 ప్రమాదాలు..నిర్లక్ష్యపు నిద్రలోనే అధికారులు

image

నిన్న ప్రమాదం జరిగి 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రజలను కలచివేస్తోంది. ప్రమాదం జరిగిన ఈ రోడ్డుపై (హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు) వారానికి 3 నుంచి 5 ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలకు కనిపించడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప స్పందించని పాలకులు, అధికారులు ఉన్నంతవరకు ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోవాల్సిందేనా?

News November 4, 2025

HYD: ఆపండయ్యా మీ రాజకీయం.. ‘ఆడ’పిల్లలను ఆదుకోండి!

image

మీర్జాగూడ ఘటనపై నేతల హంగామా తీవ్ర విమర్శలకు దారి తీసింది. మృతదేహాల మధ్య హైవే సాంక్షన్ చేశామని ఒకరు, నిధులు మంజూరు చేశామని మరొకరు, పనులు మొదలుపెట్టిందే మేమని ఇంకొకరు గొప్పలు చెప్పుకున్నారు. ‘ఎంత చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ పేద కుటుంబం పెద్దలను కోల్పోయింది. ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. గతాన్ని మార్చలేము. యాలాలలోని హాజీపూర్‌‌లో అనాథలైన <<18187789>>భవానీ, శివాలీ<<>>ని ఆదుకోండి’ అంటూ ప్రజలు కోరుతున్నారు.

News November 4, 2025

గచ్చిబౌలి: కో-లివింగ్‌లో RAIDS.. 12 మంది అరెస్ట్

image

గచ్చిబౌలి TNGOకాలనీలోని కో-లివింగ్ రూమ్స్‌లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైడ్స్‌లో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్‌, ఆరుగురు కన్జ్యూమర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.