News December 4, 2025
HYD: వెల్డింగ్ ట్రైనింగ్.. సర్టిఫికెట్

మాదాపూర్ NAC- జాతీయ భవన నిర్మాణ సంస్థలో ఇంటర్నేషనల్ స్కిల్డ్ వర్కర్స్ అప్‌గ్రేడేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. వెల్డింగ్ రంగంలో ఉద్యోగం ఉన్నవారికి 15 రోజులపాటు రూ.15,000 ఫీజుతో శిక్షణ ఇస్తారు. భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తారు. ఉద్యోగం లేనివారికి 3 నెలల వెల్డింగ్ శిక్షణను రూ.14,700 ఫీజుతో అందిస్తారు. వారికి నెలకు రూ.6,000కు భోజనం, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు.
Similar News
News December 4, 2025
ఫీటస్ హార్ట్‌బీట్ రాకపోవడానికి కారణాలివే..!

ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అయ్యాక కొంతమంది తల్లులు వారి కడుపులోని బిడ్డ గుండె చప్పుడు వినలేకపోతున్నారు. దీనికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు నిపుణులు. జన్యు సమస్యలు, hCG లెవల్స్ తగ్గి అబార్షన్ కావడం, పిండానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం, తక్కువగా ఉమ్మనీరు ఉండడం, బిడ్డలో ఏవైనా లోపాలు, తల్లికి తీవ్ర అనారోగ్యాలు వంటివి కారణం కావొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు ట్రీట్‌మెంట్ చేస్తారు.
News December 4, 2025
రుద్రంగి మండలంలో ఏకగ్రీవం అయిన పంచాయతీలివే

రుద్రంగి మండలంలో ఏడు పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. చింతామణి తండా, రూప్లా నాయక్ తండా, వీరుని తండా, అడ్డబోర్ తండా, బడి తండా, గైదిగుట్ట తండా, సర్పంచ్ తండా ఏకగ్రీవం అయిన జాబితాలో ఉన్నాయి. వీటిలో మూడు పంచాయతీల్లో సింగిల్ నామినేషన్ రాగా, మిగతా నాలుగు పంచాయతీల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవమయ్యాయి. ఏడు పంచాయతీల్లో వార్డు సభ్యులు కూడా పూర్తిగా ఏకగ్రీవం కావడం విశేషం.
News December 4, 2025
SIDBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<


