News September 10, 2024
HYD: వేగంగా RRR మార్కింగ్ రేడియల్ రోడ్లకు ప్లాన్

HYD శివారు ORR వెలుపల RRR అలైన్మెంట్ మార్కింగ్ వేగం పుంజుకుంది. GIS సర్వేయర్లు, సివిల్ ఇంజనీర్లు, ప్రత్యేక టెక్నికల్ బృందం నిరంతరాయంగా విధులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ DPR ప్లాన్ అమలు చేస్తున్నారు. HYD అంతర్భాగం నుంచి RRR వరకు రేడియల్ రోడ్ల ప్లాన్లను సిద్ధం చేయటంపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ భాగాలుగా RRR నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.
Similar News
News August 31, 2025
HYD: GREAT: పర్యావరణం కోసం ముసలవ్వ పిలుపు.!

కాప్రా చెరువు వద్ద పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న గుల్షాన్ బంబాత్ చిన్న గణపతి విగ్రహాల ద్వారానే ఎక్కువ విశ్వాసం, స్వచ్ఛమైన భక్తి ఉంటాయని అభిప్రాయపడ్డారు. చెరువులను కలుషితం చేయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆమె రాత్రిపూట కూడా చెరువు దగ్గరే ఉన్నారు. కాలుష్యరహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. “చెరువులు కలుషితం కావొద్దంటే, మనందరం మారుదాం” అని ఆమె పేర్కొన్నారు
News August 31, 2025
HYD: సండే ఆన్ సైక్లింగ్ ప్రారంభించిన గవర్నర్

HYDలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ 2025లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. సైక్లింగ్ శారీరక, మానసిక బలాన్ని పెంచుతుందని గవర్నర్ అన్నారు. ప్రోగ్రాంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు.
News August 31, 2025
HYD: కృష్ణానగర్ నివాసితులతో త్వరలో సమావేశం: కమిషనర్

HYDలో వరదలకు గల కారణాలను అన్వేషిస్తూ, సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ తెలియజేశారు. త్వరలో కృష్ణానగర్ నివాసితులతో సమావేశం నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. అమీర్పేట, కృష్ణానగర్ ప్రాంతంలో నాలా డీసిల్టింగ్ పక్రియ వేగంగా జరుగుతుండగా, ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు.