News February 11, 2025

HYD: వేధింపులు.. ఈ నంబర్లు మీ కోసమే!

image

రాజధానిలోని మూడు కమిషనరేట్‌ల పరిధిలో మహిళలు ఎలాంటి లైంగిక వేధింపులకు గురైనా.. తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. HYD-9490616555 , 8712662111, సైబరాబాద్-9490617444, తెలంగాణ మహిళా భద్రత విభాగం వాట్సాప్ 8712656856 ద్వారా సమాచారం తెలియచేస్తే కొద్ది క్షణాల్లోనే చర్యలు చేపడతామని తాజాగా పోలీసులు మహిళలకు భరోసా ఇస్తున్నారు.

Similar News

News November 9, 2025

డిసెంబర్ 15న IPL వేలం!

image

ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 15న నిర్వహించే అవకాశం ఉందని TOI పేర్కొంది. గత రెండు వేలంపాటలను దుబాయ్, సౌదీ అరేబియాలో జరపగా ఈసారి ఇండియాలోనే నిర్వహించే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా రిటెన్షన్ డెడ్‌లైన్ ఈనెల 15న ముగియనుంది. ఈలోపు ఫ్రాంచైజీలు తాము అంటిపెట్టుకునే ప్లేయర్లను ప్రకటించాలి. అయితే CSK, RR జడేజా, శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.

News November 9, 2025

లిల్లీ పూల సాగు – అనువైన రకాలు

image

☛ సెమి-డబుల్ రకాలు: వీటిలో పూల రేకులు 2-3 వరుసలలో అమరి ఉంటాయి. ఉదా: CV. సెమీ-డబుల్.
☛ డబుల్ లిల్లీ రకాలు: ఈ పూల రేకులు 3 కన్నా ఎక్కువ వరుసలలో అమరి ఉంటాయి.
☛ ఉదా: సువాసిని, స్వర్ణ రేఖ, హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, వైభవ్, పెర్ల్ డబుల్. ఈ రకాలను ఎక్కువగా బొకేల తయారీలో వాడతారు. ☛ రైతులు ఏ ఉద్దేశంతో వీటిని సాగు చేయాలనుకుంటున్నారో అందుకు అనువైన రకాన్ని వ్యవసాయ నిపుణుల సూచనలతో ఎన్నుకోవడం మంచిది.

News November 9, 2025

NZB: లాడ్జిలో వ్యభిచారం.. ఇద్దరి అరెస్ట్

image

లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో లక్ష్మీ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. లాడ్జి నిర్వాహకులు సాయిలు, రాజును అరెస్టు చేశారు. మరో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.