News February 12, 2025
HYD: వేధింపులు.. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని మృతి (UPDATE)

ఫీజు కట్టాలని వేధింపులు తాళలేక మేడ్చల్‌లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అఖిల మంగళవారం ఉదయం ఆత్మహత్యకు యత్నించగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం అఖిల చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఇదే విషయమై పలువురు పాఠశాల యాజమాన్యం వైఖరిపై మండిపడుతున్నారు.
Similar News
News July 6, 2025
JGTL: పది నెలల ఉచిత శిక్షణ.. 2 రోజులే గడువు

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో UPSC ప్రిలిమ్స్ పరీక్ష కోసం 10 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణను ఇస్తున్నట్లు జగిత్యాల SC స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.నరేష్ తెలిపారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు http://tsstudycircle.co.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9959264770 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
News July 6, 2025
HYD: నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు

మొహరం నేపథ్యంలో బీబీ కా ఆలం ఊరేగింపులో భాగంగా నేడు HYDలోని సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని మ్యూజియం అడ్మినిస్ట్రేటివ్ అధికారి తెలిపారు. అదేవిధంగా బీబీ కా ఆలం ఊరేగింపు చార్మినార్ ప్రధాన మార్గాల్లో కొనసాగనున్న నేపథ్యంలో చార్మినార్‌లోకి ప్రవేశం ఉండదన్నారు. సోమవారం తిరిగి సాలార్ జంగ్ మ్యూజియంలోకి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.
-SHARE IT
News July 6, 2025
మాలిలో మాచర్ల యువకుడు కిడ్నాప్.. విదేశాంగ శాఖకు లేఖ

మాలిలో మాచర్లకు చెందిన అమరలింగేశ్వరరావును<<16955422>> ఉగ్రవాదులు<<>> కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. జులై 1న ఏస్ నగరంలోని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉగ్రవాదులు అమరలింగేశ్వరరావుతో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేశారు. అమరలింగేశ్వరరావు 11 ఏళ్లుగా మాలిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్యాబిడ్డలు HYDలో ఉంటున్నారు. తమ కుమారుడిని విడిపించాలని కుటుంబ సభ్యులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలువగా ఆయన విదేశాంగ శాఖకు లేఖ రాశారు.