News April 30, 2024
HYD: వేసవి వేళ శ్రీశైలం టూర్.. అదరహో!
HYD నుంచి 200KM దూరంలో నల్లమల అడవుల్లో కొలువైన శ్రీశైల మల్లికార్జున దర్శనానికి వెళ్లేవారిని చల్లటి ప్రదేశం మల్లెల తీర్ధం కనువిందు చేస్తుంది. శ్రీశైలం వెళ్లే దారిలో ఫరహాబాద్ నుంచి వలవర్లపల్లి మీదుగా 15కి.మీ దూరం ప్రయాణిస్తే దట్టమైన అడవి వస్తుంది. వాహనాలు అపి కొద్ది దూరం వెళ్తే లోయలోకి సుమారు 300 మెట్లు ఉంటాయి. లోయలోకి దిగితే చల్లటి వాతావరణం శరీరాన్ని ఆవహిస్తుంది. ఇంకేం మరీ వేసవి టూర్ వెళ్దామా..!
Similar News
News January 12, 2025
హైదరాబాద్‌లో కిక్కిరిసిన వాహనాలు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని రోడ్లు ప్రయాణీకుల రద్దీ నెలకొంది. తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు, ఏపీకి వెళ్లే వారితో కూకట్పల్లి, MGBS, JBS, దిల్సుఖ్నగర్ బస్టాండ్లు రద్దీగా మారాయి. LB నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
News January 11, 2025
HYD: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. నేటి నుంచి విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. దీంతో పండగకు వెళ్లే వారితో మెట్రో రైళ్లలో రద్దీ నెలకొంది. మియాపూర్, రాయదుర్గం, అమీర్ పేట్, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
News January 11, 2025
HYD: పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్
ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 7వ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు 50 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్.. 21 దేశాల నుంచి వస్తున్నారు. వీరంతా తమ తమ దేశాలకు సంబంధించిన గాలి పటాన్ని ఎగరవేయనున్నారు.