News April 30, 2024

HYD: వ్యక్తి దారుణ హత్య

image

కడ్తాల్ పోలీస్ స్టేషన్.. మక్త మాదారం గ్రామ పరిధిలోని బటర్ ఫ్లై వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారని షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు.

Similar News

News April 3, 2026

TG: ఇసుక విక్రయాల ఆదాయంలో భారీ వృద్ధి 

image

గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2025-2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 3.71లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయాలు జరగ్గా, రూ.1,008 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు GOVT ఇసుక మాఫియాను సమర్థంగా అరికట్టింది. గతేడాది ప్రభుత్వం రూ.738కోట్లు మాత్రమే ఆర్జించింది.  స్థానికంగా ఇసుక లభ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో 17, HYD చుట్టూ 4 ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

News April 3, 2026

HYD: రూ.500 కోట్ల ఫీజులు నిలిచిపోయి సామాన్యుల తిప్పలు!

image

HYD శివారులోని 74 గ్రామ పంచాయతీల పరిధిలో హెచ్ఎండీఏ (HMDA), కొత్తగా ఏర్పాటైన ఎఫ్‌సీడీఏ (FCDA) మధ్య తీవ్ర అధికార పోరు సాగుతోంది. లేఅవుట్ పర్మిషన్లు, డెవలప్‌మెంట్ ఫీజుల రూపంలో వచ్చే సుమారు రూ.500 కోట్ల ఆదాయం ఎవరికి చెందాలనే దానిపై స్పష్టత లేక ఫైళ్లు పెండింగ్‌లో పడ్డాయి. రెండు సంస్థల జోక్యంతో న్యాయపరమైన చిక్కులు వస్తుండటంతో అటు పర్మిషన్లు రాక సామాన్యులు, ఇటు ఆదాయం లేక ఖజానా నష్టపోతున్నాయి.

News April 3, 2026

HYD: తెలంగాణలో కొత్త పెన్షన్ చెల్లింపు విధానం..!

image

2026-2027 కొత్త ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్లు చెల్లించడంలో TG GOVT E-PPO (ఎలక్ట్రిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్) అనే ఓ కొత్త విధానాన్ని 2 నెలల్లో ప్రవేశపెట్టనుంది. తద్వారా పెన్షన్‌దారులు ఆఫీస్‌కు వెళ్లకుండా తమ వివరాలను నేరుగా అప్‌డేట్ చేసుకోవడం, 12 నంబర్లతో ఉన్న ఒక కోడ్ ద్వారా ప్రతి నెల పెన్షన్ పొందడం, మరణించిన వారి చెల్లింపులు తక్షణం నిలిపివేయడానికి సహాయపడుతుంది.