News January 28, 2025
HYD: శంకర్‌పల్లికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామానికి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు చిరంజీవి రానున్నారు. ఇక్కడ 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియం పార్కును మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం ప్రారంభించనున్నారు. ఉ.11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పార్క్ అధినేత రాందేవ్‌రావు తెలిపారు. తమ పార్క్‌లో అరుదైన జాతులకు సంబంధించి 25 వేల రకాల మొక్కలను పెంచామన్నారు.
Similar News
News December 22, 2025
వివాదాలపై వెంటనే చర్యలు తీసుకోండి : SP

అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమంలో భాగంగా SP ధీరజ్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. సివిల్, కుటుంబ, ఆస్తి వివాదాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన దివ్యాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. వృద్ధులు, మహిళలు, వికలాంగుల సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
News December 22, 2025
PGRSకు 27 అర్జీలు: SP రాహుల్ మీనా

అమలాపురం: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 27 సమస్యలు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీ రాహుల్ మీనాను కలిసి తమ సమస్యలను లిఖితపూర్వకంగా విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News December 22, 2025
ములుగు: నలిగిపోతున్న ఆ ‘శాఖ’ సిబ్బంది!

జిల్లాలోని అటవీ శాఖలో కొందరు కిందిస్థాయి సిబ్బంది నలిగిపోతున్నారు. బీటు, సెక్షన్, రేంజ్ స్థాయి వరకు ఉన్నతాధికారులు, రాజకీయ ఒత్తిడి, గ్రామస్థుల తిరుగుబాటుతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అడవుల్లో గుత్తికోయల చట్టవ్యతిరేకమైన నిర్మాణాల కూల్చివేతలపై విధులు నిర్వహిస్తున్న వారిపై దాడులకు వెనుకాడడం లేదని వాపోతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విధులు నిర్వహిస్తున్నామని కుమిలిపోతున్నట్లు సమాచారం.


