News March 28, 2025
HYD: శాసనమండలి సభ్యులను సన్మానించిన సీఎం

శాసనమండలిలో పదవీ కాలం పూర్తి చేసుకున్న సభ్యులను ఘనంగా సత్కరించారు. శాసనమండలి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పదవీ కాలం పూర్తి చేసుకున్న తొమ్మిది మంది సభ్యులను సత్కరించారు. మార్చి 29వ తేదీతో వీరి పదవి కాలం ముగియనుంది. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితో పాటు పలువురు పాల్గొన్నారు.
Similar News
News March 31, 2025
OU దూర విద్యలో ప్రవేశాలకు రేపు లాస్ట్ డేట్

ఓయూ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(పీజీఆర్ఆర్సీడీఈ)లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్-2 కింద UG, PG, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది. అర్హులైన వారు మార్చి 31లోగా అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
News March 31, 2025
HYD: ‘స్మోకింగ్‌తో హృదయాన్ని హింసించవద్దు’

తెలుగు ప్రజల తొలి పండుగ ఉగాది సందర్భంగా పొగాకు, ధూమపానం అలవాట్లకు స్వస్తి పలకాలని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. స్మోకింగ్‌తో హృదయాన్ని హింసించ వద్దని ‘మాచన’ స్మోకర్స్‌ను కోరారు. పొగాకు ధూమపానం అలవాట్లు జీవితానికి చేదు అనుభవం మిగిలిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
News March 30, 2025
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 222 మంది చిక్కారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 222 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 163 ద్విచక్ర వాహనాలు, 9 త్రిచక్ర వాహనాలు, 48 నాలుగు చక్రాల వాహనాలు, 2 హెవీ వెహికిల్ వాహనాలు పట్టుబడ్డాయన్నారు. పట్టుబడ్డ వారందరినీ కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.