News February 8, 2026
HYD: శివరాత్రి.. వేములవాడ వెళ్లేవారికి గమనిక..!

వేములవాడ శ్రీ రాజన్న ఆలయ పరిసరాల్లోని ప్రైవేట్ లాడ్జీలు, వసతి గృహాల్లో నిర్ణీత అద్దెను మాత్రమే వసూలు చేయాలని అక్కడి మున్సిపల్ కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
1. సింగిల్ రూమ్ NON A/C- రూ.300
2. సింగిల్ రూమ్ A/C- రూ.600
3. సింగిల్ బెడ్రూం డీలక్స్ NON A/C- రూ.500
4. సింగిల్ బెడ్రూం డీలక్స్ A/C- రూ.1,200
5. డబుల్ బెడ్రూం డీలక్స్ NON A/C- రూ.1,000
6. డబుల్ బెడ్రూం డీలక్స్ A/C- రూ.1,500 #SHARE IT.
Similar News
News February 10, 2026
IT కోటలో ఐఐటీయన్ల అడ్డా

మన హైదరాబాద్ గడ్డపై ఐఐటీయన్లు గట్టిగానే ప్లాన్ చేశారు. భారత్ ఏఐ ఇంపాక్ట్ సమిట్‌కు మద్దతుగా మార్చి 8న వెస్టిన్ హోటల్‌లో ‘పాన్-ఐఐటీ సదస్సు’ జరగనుంది. త్వరలో ఫ్రాన్స్‌లో జరిగే ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమానికి కూడా వీరు తోడుగా నిలవనున్నారు. ప్రభాత్ కుమార్ నేతృత్వంలో ఐఐటీ HYDలో కొత్త ఆఫీసు కూడా రాబోతోంది. ఆరోగ్యం, డిఫెన్స్ రంగాల్లో ఏఐ విప్లవంపై 600 మందికి పైగా నిపుణులు ఈ వేదికపై చర్చించనున్నారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

కంటోన్మెంట్ MLA శ్రీ గణేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మంచిర్యాల బస్ స్టాప్ సమీపంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.