News March 25, 2024

HYD: శ్వేత అంత్యక్రియలు పూర్తి

image

ఇటీవల ఆస్ట్రేలియాలో హత్యకు గురైన హైదరాబాద్ మహిళ శ్వేత అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఆస్ట్రేలియా నుంచి నగరానికి చేరుకున్న శ్వేత మృతదేహాన్ని ఏఎస్‌రావు నగర్ డివిజన్ బృందావన్ కాలనీలోని ఆమె తల్లిదండ్రులను నివాసానికి తరలించారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మల్లాపూర్‌లోని వైకుంఠధామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

Similar News

News January 8, 2025

HYD: జైలులోనే డిగ్రీ, పీజీ చేశారు

image

HYDలో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ వార్షిక రిపోర్టులో కీలక విషయాలు తెలిపింది. 2024లో రాష్ట్రంలో జైలుకెళ్లిన వారిలో 750 మంది గ్రాడ్యుయేషన్, 225 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసినట్లుగా పేర్కొంది. జైళ్లలో ఉండి చదువుకోవాలనుకున్న వారికి చెంగిచెర్ల, చర్లపల్లి, సంగారెడ్డి జిల్లాలోని జైళ్లలోనూ అవకాశం కల్పించారు.

News January 8, 2025

HYD: ఆహార నాణ్యతలో తెలంగాణకు 24 RANK

image

ఆహార నాణ్యతలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం 24వ స్థానానికి పడిపోయిందని FSSAI ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్-2024 రిపోర్టును FSSAI అధికారులు విడుదల చేశారు. 100 మార్కులకుగాను కేవలం 35.75 మార్కులు మాత్రమే సాధించడం గమనార్హం. HYD నగరం సహ, అనేక చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార కల్తీ జరిగిన ఘటనలు కోకోల్లలుగా చూసిన సంగతి తెలిసిందే.

News January 8, 2025

సికింద్రాబాద్: స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలు

image

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్‌ హెడ్ క్వార్టర్స్‌‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌‌‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT